ఒక్క యాడ్‌కి కోటిన్నర...!

1 and half crore for one ad

11:32 AM ON 28th December, 2015 By Mirchi Vilas

1 and half crore for one ad

టాలీవుడ్‌లో ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హవా నడుస్తుంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో హిట్‌ అందుకున్న ఈ భామ ఆ తరువాత స్టార్‌ హీరోలతో వరుస పెట్టి జత కట్టింది. తాజాగా ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌ సరసన నటిస్తున్న ఈ భామకి మరో అవకాశం వచ్చింది. అది సినిమాలో కాదు, జూవెలరీ యాడ్‌ లో. విశాఖపట్నంకి చెందిన ఒక జూవెలరీ సంస్థ తమ యాడ్‌ కోసం రకుల్‌కి ఏకంగా కోటిన్నర ఇస్తామని చెప్పారట. ఈ సంస్ధకి రకుల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండబోతుంది మాట. మూడు సినిమాల్లో నటిస్తే వచ్చే డబ్బు ఈ ఒక్క యాడ్‌కి అంత మొత్తంలో రావడంతో రకుల్‌ వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసిందట. ఈ కాంట్ర్యాక్ట్ దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు కొనసాగుతుందట.

రకుల్ ప్రీత్ సెక్సీ ఫొటో షూట్ ను చూడండి

English summary

Rakul Preeth Singh signs for Jewellery advertisement and the remuneration was 1 and half crore.