మే నెలలో కోటి లడ్డూల పంపిణీ... ఇదో కొత్త రికార్డు

1 crore Laddu's sold in may month in TTD

11:18 AM ON 6th June, 2016 By Mirchi Vilas

1 crore Laddu's sold in may month in TTD

శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) లడ్డూల పంపిణీలో సరికొత్త రికార్డు సృష్టించింది. మే నెలలో కోటి లడ్డూలను పంపిణీ చేసింది. శ్రీవారి ఆలయ పోటు విభాగం ఆదివారం లెక్క తేల్చింది. దీంతో దేవస్థానం చరిత్రలో అత్యధికంగా ప్రసాదం పంపిణీ జరిగినట్లు రికార్డుకెక్కింది. ఎన్నడూ లేనంతగా గత మాసంలో 25.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో ఇతర నెలల కంటే మే మాసంలోనే శ్రీవారిని ఎక్కువ మంది దర్శించుకుంటున్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.

స్వామిని దర్శించుకునే ధర్మదర్శనం భక్తులకు రాయితీ పై రూ.20 ధరతో 2, అదనపు లడ్డూలు కింద రూ.50 పై రెండు 2 వంతున ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు టిటిడి అందిస్తుంది. కాలినడకన వచ్చే యాత్రికులకు ఉచితంగా ఒకటి, రాయితీ పై 2, అదనపు లడ్డూలు కింద 2 వంతున మొత్తం 5 అందిస్తోంది. వికలాంగులకు, వయోవృద్ధులకూ దీన్ని వర్తింపచేస్తోంది. వీఐపీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల పై ఉచితంగా 2 లడ్డూలతో పాటు మరో 2 అదనపు లడ్డూలు ఇస్తోంది. ఆర్జిత సేవల పై ఉచితంగా ఇవ్వడంతో పాటు లడ్డూపడి టిక్కెట్ల(ఎల్పీటీ)పై లడ్డూలను విక్రయిస్తోంది.

ఈ మేరకు లెక్కింపు జరగ్గా కోటి వరకు లడ్డూలను భక్తులకు పంపిణీ చేసింది. గత మాసం 28న ఒక్కరోజే అత్యధికంగా 4.05 లక్షల లడ్డూలను పంపిణీ చేసింది. 2013 మేలో 72.33 లక్షలు, 2014 మేలో 80.64 లక్షలు, 2015 మేలో 89.84 లక్షల లడ్డూలను పంపిణీ చేసింది.

English summary

1 crore Laddu's sold in may month in TTD