'నాన్నకు ప్రేమతో' లో ఆ కోటి బైక్ ఎందుకు వాడనట్టు?

1 crore rupees bike was not used in Nannaku Prematho movie

04:38 PM ON 7th May, 2016 By Mirchi Vilas

1 crore rupees bike was not used in Nannaku Prematho movie

ఎన్టీఆర్ కెరీర్ ని మలుపుతిప్పిన సినిమా 'నాన్నకు ప్రేమతో'. కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా 55 కోట్ల మార్క్ ని అలాగే ఓవర్సీస్ లో తొలిసారిగా 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాడు. ఇన్ని రికార్డులు భారీ పోటీ నడుమ సాధించిన ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఓ బైక్ గురించిన వార్త అప్పట్లో బాగా హల్ చల్ చేసింది. 1997 మోడల్ 'హార్లే డేవిడ్ సన్' బైక్ ని ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్స్ లో వాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సినిమా విడుదల అయ్యాక సినిమా మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్కసారి కూడా ఈ బైక్ పై కనిపించలేదు.

సినిమా మొత్తం రేంజ్ రోవర్ కార్ లో లేకపోతే ఓ సైకిల్ మీదే ఒకటి రెండు సీన్స్ లో కనిపించాడు. కాగా ఈ సినిమా కోసమే ఈ బైక్ ని సుమారు 1 కోటి పెట్టి తీసుకున్నట్లు చెప్పారు. దీని గురించి యూనిట్ లోని కొందరు 'ఈ బైక్ పై ఓ హై ఒల్టేజ్ యాక్షన్ సన్నివేశం తియ్యాలని అనుకున్నా టైం లేక తీయలేకపోయినట్లు' చెబుతున్నారు. అందుకే సినిమాలో ఈ బైక్ కి సంబంధించిన సన్నివేశాలు లేవు, కానీ ఉంటే బాగుండేదని అంటున్నారు.

English summary

1 crore rupees bike was not used in Nannaku Prematho movie. 1 crore rupees bike was not used in movie because of insufficient time.