5 పైసలకే కిలో ఉల్లిపాయలు!

1 kilo onions is only 5 paisa

02:31 PM ON 26th August, 2016 By Mirchi Vilas

1 kilo onions is only 5 paisa

మీరు విన్నది నిజమే 5 పైసలకే కిలో ఉల్లిపాయలు ఇస్తున్నారు. అయితే ఇది మన రాష్ట్రంలో కాదులేండి. ఇంతకీ ఎక్కడో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ఇన్నాళ్లు ప్రజలకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లిగడ్డలు నేడు వాటిని పండించిన రైతన్నలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రూ. 5 పైసలకే కిలో ఉల్లిగడ్డలు... మంచి చౌకబేరం అంటూ సాక్షాత్తూ ఓ రైతు తన వ్యవసాయక్షేత్రంలో 13 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను విక్రయించి వినూత్న నిరసన తెలిపిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా కరంజగామ్ గ్రామంలో చోటుచేసుకుంది. సుధాకర్ దారాడే అనే రైతు పండించిన 13 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను విక్రయించేందుకు సాయిఖేద వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకువచ్చారు.

సుధాకర్ తీసుకువచ్చిన చిన్నగా ఉన్నాయని, నాణ్యత బాగా లేదనే సాకు చూపించిన వ్యాపారులు క్వింటాల్ ఉల్లి బస్తా ఐదు రూపాయలుగా నిర్ణయించారు. 13 క్వింటాళ్లకు రూ.65 లు ఇస్తామన్నారు. దీంతో ఆగ్రహించిన రైతు తాను తెచ్చిన ఉల్లిగడ్డలను తిరిగి తీసుకువెళ్లి వ్యవసాయక్షేత్రంలో వేసి, వ్యాపారులు, మార్కెట్ అధికారుల వైఖరికి నిరసనగా ఐదు పైసలకే కిలో ఉల్లిగడ్డల చొప్పున విక్రయించాడు. ఎకరం ఉల్లి సాగుకు రూ. 700లు ఖర్చు అయిందని, వీటిని వ్యవసాయక్షేత్రం నుంచి మార్కెట్ కు తరలించేందుకు రవాణా ఖర్చులు రూ. 780 అయ్యాయని రైతు ఆవేదనగా చెప్పారు.

తనకున్న పదెకరాల భూమిలో ఉల్లిగడ్డలు పండిస్తుంటానని, ఏప్రిల్ నెలలో ధర వస్తుందని భావించి వెయ్యి క్వింటాళ్ల సరకును ఇంట్లో నిల్వ చేశానని రైతు సుధాకర్ చెప్పారు. మార్కెట్ లో 35 రోజుల సమ్మె వల్ల ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయని రైతులు లబోదిబోమన్నారు. కాగా మార్కెట్ లో ఉల్లి క్వింటాల్ ధర 600 నుంచి 700 రూపాయలుందని, నాణ్యత లేని సరకు తెచ్చినందున క్వింటాల్ ఐదు రూపాయలకే అడిగామని వ్యాపారి సురేష్ చెపుతున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి క్వింటాల్ కు రూ.2,000 చొప్పున ఇప్పించాలని డిమాండు చేస్తూ తాము తాలూకా కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతామని ఎన్సీపీ నాయకుడు రవీంద్ర పాగర్ చెప్పారు.

ఇది కూడా చదవండి:ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే

ఇది కూడా చదవండి:అభిమన్యుడుని చంపడానికి రచించిన పద్మవ్యూహానికి సంబంధించి పూర్తి ప్లాన్ ఇదే!

ఇది కూడా చదవండి:ఆ విషయంలో పవన్ ని ఫాలో అవుతున్న చిరంజీవి

English summary

1 kilo onions is only 5 paisa