'స్వచ్ఛమైన ప్రేమ' కావాలంటే కిలో రూ. 99 మాత్రమే!

1 kilogram novels 99 rupees only

03:59 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

1 kilogram novels 99 rupees only

స్వచ్ఛం, నకిలీ అనేది వస్తువుల్లోనే కాదు ప్రేమలోనూ వుంది. అందుకే కదా ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇక మీకెవరికైనా స్వచ్ఛమైన ప్రేమ కావాలంటే... న్యూఢిల్లీ దార్యగంజ్ లో ఉన్న తమ బిగ్ బుక్ బజార్ ను సందర్శించండి అని నిర్వాహకులు అంటున్నారు. అక్కడ, స్వచ్ఛమైన ప్రేమ కిలో 99 రూపాయలకు విక్రయిస్తామని సదరు బిగ్ బుక్ బజార్ నిర్వాహకులు సైన్ బోర్డు పెట్టారు. ఈ బోర్డు చూసి యువతీ యువకులు మాత్రం ఆ పుస్తకాల షాపు ముందు బారులు తీరారు.

1/2 Pages

ఇంతకీ ఈ స్వచ్ఛమైన ప్రేమ కథ కమామీషు ఏమిటో మీరే చదవండి.

మిల్స్ అండ్ బూన్ రొమాన్స్ నవలలు, విలియం షేక్ స్పియర్ రాసిన పుస్తకాలు... జనే ఆస్టిన్ ఓమ్నీబస్, కారల్ మార్క్స్ క్యాపిటల్ ఇలా ఏ పుస్తకాలనైనా కిలో 99రూపాయలకే విక్రయిస్తామంటున్నారు బిగ్ బుక్ బజార్ నిర్వాహకుడు జైన్. వివిధ పుస్తకాలు గోదాముల్లో మగ్గుతున్న నేపథ్యంలో వాటిని విక్రయించేందుకు పుస్తకాలను కిలోల లెక్కన విక్రయించడానికి పుస్తకవిక్రేత అయిన జైన్ శ్రీకారం చుట్టానంటారు. ప్రజలు పుస్తకాలు కొనేలా ప్రోత్సహించేందుకు పుస్తకాలను ఎంఆర్పీ ధరలకు కాకుండా కిలో 99రూపాయల చొప్పున విక్రయిస్తున్నానని జైన్ అంటున్నాడు. అయితే ఇందులో భాగంగా స్వచ్ఛమైన ప్రేమ పుస్తకాలను సైతం కిలో 99 రూపాయలేనంటూ పుస్తకాల షాపు ముందు పెట్టిన సైన్ బోర్డు యువతను ఆకట్టుకుంటోంది. తీరా విషయం తెల్సి విస్తుపోవడం ఆపై నవ్వుకోవడం వారి వంతయింది.

English summary

1 kilogram novels 99 rupees only