పాడైన ఆహారం అందించిన ఎయిరిండియాకు లక్ష జరిమానా

1 lakh fine for Air India for giving unhealthy food for passenger

12:45 PM ON 27th September, 2016 By Mirchi Vilas

1 lakh fine for Air India for giving unhealthy food for passenger

రైల్లో భోజనాలు ఎలా వుంటాయో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇందులో అన్ని వర్గాల ప్రయాణికులు వుంటారు. కానీ డబ్బున్న వాళ్ళే ప్రయాణించే, ఇక విమానంలో భోజనాల విషయానికి వస్తే, చాలా దారుణంగా ఉందట. దీనికి తార్కాణం ఈ ఘటనే. పాడైపోయిన ఆహారం అందించినందుకు ఓ ప్రయాణికురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఎయిరిండియా యాజమాన్యాన్ని జాతీయ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఆహారం విషయంలో అలసత్వం తగదని, ఇటువంటి పొరబాట్ల వల్ల ప్రయాణికుల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మాలతీ మధుకర్ పహడే అనే మహిళ గత ఏడాది ముంబై నుంచి న్యూయార్క్ కు ఎయిరిండియా విమానంలో ప్రయాణించింది.

ఆ సమయంలో తనకు పాచిపోయిన ఆహారం ఇచ్చారని, అన్నంలో వెంట్రుకలు ఉండగా పెరుగు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉందని, దీంతో తాను ఏమీ తినకుండా ప్రయాణించానని తెలుపుతూ తొలుత జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఎయిరిండియాకు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును ఎయిరిండియా రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో సవాలు చేసింది. అయితే, రాష్ట్ర ఫోరం ఆ జరిమానాను రూ.లక్షకు పెంచడంతో ఎయిరిండియా మళ్లీ జాతీయ కమిషన్ లో పిటిషన్ వేసింది. దీనిని కొట్టేసిన జాతీయ కమిషన్ ప్రయాణికురాలికి రూ.లక్ష చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ, ఆదేశించింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం అవుతోంది.

English summary

1 lakh fine for Air India for giving unhealthy food for passenger