వావ్ ఒక్కరోజే లక్ష ఫోన్లు అమ్మేసారట!

1 lakh moto e phones sold out in one day

04:50 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

1 lakh moto e phones sold out in one day

ప్రతి మనిషి చేతిలో మొబైల్ ఫోన్ వుంది. ఇక స్మార్ట్ ఫోన్లు కూడా ఇంచుమించు అందరి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. సినిమా కలెక్షన్స్ మాదిరిగా, స్మార్ట్ ఫోన్ల అమ్మకాల రేటింగ్ కూడా పెద్ద ఇమేజ్ తెచ్చిపెడుతోంది. ఇక ఇప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు ఎన్ని వస్తున్నా, మోటో ఈకి ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు. సోమవారం మోటో ఈ3 పవర్ స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదల చేసిన ఒక్క రోజులోనే లక్షఫోన్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ నిర్వాహకులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫ్లిప్ కార్ట్, మోటో ఇండియా టీమ్ లు చరిత్ర సృష్టించాయి.

ఒక్క రోజులోనే మోటో ఈ3 పవర్ ఫోన్లు లక్ష అమ్ముడుపోయాయి అని తెలుపుతూ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ కి 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమరీ ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలోతో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 4జీ, 3జీ సపోర్ట్ చేస్తుంది. 5 అంగుళాల తాకే తెర, 1 గిగాహెడ్జ్ ప్రొసెసర్, 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరాతో పాటు పలు ఫీచర్లు ఉన్నాయి. సోమవారం విడుదలైన మోటో ఈ3 పవర్ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,999గా కంపెనీ ప్రకటించింది. అదే రోజు రాత్రి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

English summary

1 lakh moto e phones sold out in one day