లీటర్ నీళ్లు 4 లక్షలు.. అంత ఖరీదు ఎందుకో తెలుసా?

1 litre water bottle cost is 4 lakhs

12:25 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

1 litre water bottle cost is 4 lakhs

అయ్యబాబోయ్ అనుకుంటున్నారా? ఇంతకూ ఆశ్చర్యంలో మునిగిపోయారా? ఎన్ని అనుకున్నా ఇది మాత్రం పచ్చి నిజం. దక్షిణ అమెరికాలోని ఆండెస్ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యమూ లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు తవ్వి తీసిన నీరే లాక్వెన్ మినరల్ వాటర్. బాటిల్లో నింపే వరకూ గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీళ్లు, అని ఈ కంపెనీ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి, క్రికెట్ మ్యాచుల సమయంలో విరాట్ కోహ్లీ ఏ హోటల్లో బస చేసినా అతడికోసం తప్పకుండా.. ఎవియాన్- మంచినీళ్ల బాటిళ్లను తెప్పించాల్సిందేనట.

మామూలుగా అయితే ఈ విషయాన్ని అంత ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ ఈ బ్రాండ్ నీళ్ల ఖరీదు లీటరు రూ.600కు పైనే. అంటే మంచినీళ్లకే రోజుకి కొన్ని వేలవుతాయన్నమాట. దీనికన్నా ఎన్నో రెట్లు ఖరీదైన మంచినీళ్ల బ్రాండ్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఖరీదైన ఆ నీటి కథలలోకి వెల్దామా..

1/7 Pages

ఎవియాన్... లీటరు రూ.600కు పైనే...


1789లో ఫ్రాన్స్ కి చెందిన మార్కిస్ అనే వ్యక్తి రోజూ వాకింగ్ కి వెళ్తూ స్థానికంగా ఎవియాన్ లెస్ బెయిన్స్ దగ్గరున్న నీటి బుగ్గ దగ్గర నీరు తాగేవాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్ సమస్యలు నయమయ్యాయట. అదికాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఎవియాన్ బ్రాండ్ గా విస్తరించింది. చాలామంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతారు. మనదేశంలోనూ ఆన్-లైన్ ద్వారా ఈ బాటిళ్లను అమ్ముతున్నారండోయ్.

English summary

1 litre water bottle cost is 4 lakhs