10 బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ 

10 Best Photo Editing Apps

07:04 PM ON 26th November, 2015 By Mirchi Vilas

10 Best Photo Editing Apps

మనం తీసుకున్న ఫోటోలు మరింత అందంగా కనిపించాలంటే ఫోటో ను ఎడిటింగ్ చెయ్యడం తప్పని సరి. మన స్మార్ట్ ఫోన్ లోనే ఫోటో కు మంచి ఫినిషింగ్ టచ్ ను ఇవ్వడానికి అనేక ఆప్ లు అందుబాటులో ఉన్నాయి. అందులోని కొన్ని బెస్ట్ ఆప్ లను ఇప్పుడు చూద్దాం.

1). VSCO Cam

ఈ ఆప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఆపిల్ ఐ-స్టోర్ లో ను అందుబాటులో ఉంది. ఈ ఆప్ మొదట్లో పేయిడ్ ఆప్ గా ఉండేది కానీ గత సంవత్సరం ఉచితం గా అందుబాటులోకి తెచ్చారు. బెస్ట్ ఫోటో ఎడిటింగ్ ఆప్ లలో ఇది ఒకటి దీనిలో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. VSCO Cam ఆప్ లో వినూత్నమైన ఫిల్టర్లను ఇస్టాగ్రామ్ లోని ఫిల్టర్ల కన్నా మెరుగ్గా ఉంటాయి. ఆ ఆప్ లో కొనను ఫిల్టర్ లను ఉచితంగా వాడుకోవచ్చు కాగా మరి కొన్ని వాటికి మాత్రం డబ్బు చెల్లించి కొనుకోవాల్సి ఉంటుంది. VSCO Cam లోని ఎడిటింగ్ టూల్స్ సహాయంతో ఫోటోకు రంగులను ,కాంతి ని పెంచుకోవడం , ఫోటో కట్ చెయ్యడం లాంటి ఫీచర్లు ఉన్నాయి.

Download Now

2). Pics Art

Pics Art ఆప్ ను అల్ రౌండర్ ఆప్ గా అభివర్ణించవచ్చు. ఈ ఆప్ లోని ఫిల్టరింగ్ టూల్స్, డ్రాయింగ్ టూల్స్ సహాయంతో మన ఫోటోలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇందులోని మన ఫోటో లను అన్ని ఒక ఫ్రేమ్ లో పెట్టుకుని అందం గా చేసుకోవచ్చు. అలా మనం ఎడిట్ చేసిన ఫోటోలను ఈ ఆప్ నుండి నేరుగా సోషల్ మీడియా లోకి అప్ లోడ్ చేసుకోవచ్చు.

Download Now

3). Pixl Express

ఈ ఆప్ తో మీరు మీ ఫోటో లను చాలా త్వరగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ అప్ లో రెడ్ ఐ రిమూవల్ , బ్రైటేన్నింగ్ , స్మూతింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అనేక అత్యాధునిక ఫోటో ఎడిటింగ్ ఫిల్టర్లు , ఫోటోను క్రాప్ చేసుకుని వీలుంది. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ ఆప్ ను ఉచితం గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Download Now

4).Snapseed


ఈ ఆప్ ను నిక్ సాఫ్ట్ వేర్ సంస్థ లోని నిపుణులు తయారు చేసారు. ఈ ఆప్ లో మన ఫోటో లకు మంచి టచ్ అప్ ఇవ్వచ్చు. ఈ ఆప్ సహాయంతో మన ఫోటో కు కావలసిన బ్రైట్ నెస్,కాంట్రాస్ట్ , సాట్యురేషన్ వంటి పనులన్నీ దానంతట అదే చేసేస్తుంది. మనం కుడా మనకి నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ అప్ లో రిట్రోలక్స్ , వింటేజ్,ట్లిట్ షిఫ్ట్ ,గ్రంజ్ ,డ్రామా లాన్తిఒ ఫిల్టర్లను ఉచితంగా వాడుకోవచ్చు.

Download Now

5). Aviary Photo Editor


సాధారణ ఫీచర్లు ఉన్న ఆప్ కంటే ఈ అప్ లో కాస్త ఎక్కువ ఫీచర్లు ఉన్నాయని చెప్పాలి . ప్రతి ఫోటో ఎడిటింగ్ ఆప్ లో ఉండే రొటేటింగ్ , క్రాప్పింగ్, కారెక్టింగ్ వంటి ఫీచర్లు నే కాక టిల్ట్ షిఫ్ట్ , ఫోకస్ ,ఇన్పుట్, కాస్మెటిక్ కారెక్షన్స్ , మేమే జనరేటర్ వంటి భిన్నమైన ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఆప్ సహాయం తో అనేక స్టికర్ లు , ఫోటో కు ఫ్రేమ్ లు, వంటివి ఉచితం గా నే వాడుకోవచ్చు.

Download Now

6). PhotoDirector

ఈ ఆప్ ను ప్రముఖ మల్టీ మీడియా సాఫ్ట్ వేర్ కంపెనీ సైబర్ లింక్ వారు అభివృధి చేసారు. ఈ ఆప్ ను మల్టీ పర్పస్ ఫోటో ఎడిటర్ గా చెప్పచ్చు. ఈ ఆప్ సహాయంతో మనం మన ఫోటో లకు మరిన్ని అదనపు హంగులను జోడించవచ్చు. మన ఫోటో లకు అత్యాదునిక హంగులను మంచి ఎఫెక్ట్ లను జోడించవచ్చు. ఈ ఆప్ లో ఆధునిక ఫీచర్లు అయిన RGB Curves , HSL Tools ను మనం చూడచ్చు.

Download Now

7). Cymera

ఈ ఆప్ లో మన ఫోటో లను ఎడిట్ చేసుకోవడానికి మనం నేరుగా ఆప్ ద్వారా ఫోటోలను తీసుకోవచ్చు లేదా మన ఫోన్ లోని ఫోటో లను ఎంచుకుని చక్కగా తీర్చిదిద్దవచ్చు. ఈ ఆప్ లో ఏడు విభిన్న రకాలైన లెన్స్ లు , నాలుగు వేరు వేరు రికార్డింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఆప్ లో 20 రకాలైన ఫిల్టర్లు , మేక్ అప్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఆప్ నుండి నేరుగా సోషల్ మీడియా సైట్ల లో మన ఫోటో లను అప్ లోడ్ చెయ్యచ్చు.

Download Now

8). Flickr

ఈ ఆప్ కు వినియోగదారు లలో మంచి ఆదరణ ఉంది. ఈ ఆప్ ద్వారా తమ ఫోటోలకు ఆధునిక ఎడిటింగ్ టూల్స్ తో కొత్త దనం కోరుకునే వారికి చాలా అవసరం . ఈ ఆప్ లోని ఫిల్టర్లు మన ఫోటో లకు ఒక కొత్త లుక్ ను తీసుకువస్తాయి .

Download Now

9) Repix

అందంగా కనిపించాలనుకునే వారికి ఈ ఆప్ సరైన చాయిస్ గా చెప్పవచ్చు . ఇందులోని ఎడిటింగ్ టూల్స్ , మంచి ఎడిటింగ్ ఫిల్టర్లు, ఫ్లరేస్ , పోస్టేరైజ్ వంటి ఎఫెక్ట్స్ సాయంతో మన ఫోటో లను అత్యంత అందం గా తీర్చిదిద్దవచ్చు . కాకపోతే వాటిని మాత్రం కొనాల్సి వస్తుంది.

Download Now

10). Photo Studio

Photo Studio ఆప్ తో మన ఫోటోలకు రీ టచింగ్, అనేక ఎఫెక్ట్ లు వంటివి మన ఫోటోలకు చేసుకోవచ్చు. ఈ ఆప్ లోని మిర్రర్ ఇమేజ్ టూల్స్ , లైటేనింగ్ టూల్స్ ,బ్లర్ ఎఫెక్ట్ ,టెక్స్ట్ ఎడిటర్ వంటి ఫీచర్లతో మన ఫోటో లను అత్యంత అందం గా చేసుకోవచ్చు.

Download NowEnglish summary

Here Are the 10 best smart phone photo editing apps