మనోడే...ఇవ్వండి పది కోట్లు..

10 Crore Remuneration For Koratala Siva

11:36 AM ON 19th February, 2016 By Mirchi Vilas

10 Crore Remuneration For Koratala Siva

'నాన్నకు ప్రేమతో' విజయం తరువాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించనున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటించనున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇందులో ఎన్టీఆర్‌ కి మావయ్యగా నటిస్తుండగా, ఇందులో మోహన్‌లాల్‌ కి భార్యగా దేవయాని నటించనుంది. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ పారితోషికం కోసం ఎన్టీఆర్‌ రికమండ్‌ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే కొరటాల శివ మొదటి చిత్రం 'మిర్చి' చిత్రానికి 50 లక్షలు పారితోషికం తీసుకున్నాడు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో కొరటాల డిమాండ్‌ చెయ్యకుండానే 'శ్రీమంతుడు' చిత్రానికి 4 కోట్లు పారితోషికం ఇచ్చారు. ఇది కూడా సూపర్‌హిట్‌ కావడంతో ఎన్టీఆర్‌ నుండి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రానికి 'జనతా గ్యారేజ్‌' నిర్మాతలు కొరటాల శివకి 8 కోట్లు పారితోషికం ఇస్తానంటే ఎన్టీఆర్‌ రికమండ్‌ చేసి మరి 10 కోట్లు పారితోషికం ఇప్పిస్తున్నాడని సమాచారం. దీనితో కొరటాల శివ చాలా హ్యాపీగా ఉన్నాడట. అంతే కాదు మూడో సినిమాకే 10 కోట్లు పారితోషికం తీసుకోవడమంటే మాములు విషయం కాదు. ఆ రేంజ్‌లో పారితోషికం తీసుకుంటుంది ఒక్క రాజమౌళి, త్రివిక్రమ్‌, పూరీ జగన్నాధ్‌ మాత్రమే.

English summary

Koratala Shiva was now busy with the film Janata Gqarage with young tiger NTR.Koratala Shiva Takes 50 lakh remuneration for his first film Mirchi and 4 crores for Srimanthudu movie and now NTR recommends 10 crore remuneration to Koratala Shiva.This movie was producing by Mythri Movie Makers.