గ్లోబల్ కంపెనీలను అధిరోహించిన పది మంది ఇండియన్స్

10 Indians who head global tech companies

01:15 PM ON 24th December, 2015 By Mirchi Vilas

10 Indians who head global tech companies

అపారమైన మేధోసంపత్తి భారత్‌ సొంతం. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఇక టెక్నాలజీ రంగంలో అయితే మనకు తిరుగే లేదు. అందువల్లే పలు గ్లోబల్ కంపెనీల్లో అత్యున్నత పదులను మన భారతీయులు అధిరోహించారు. అంతేకాక ఇప్పుడు వాటిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అపారమైన తెలివితేటలు. గొప్ప ఆలోచన శక్తి. కష్టించి పనిచేసేతత్వం. సమస్యను షర్కరించడంలో ఓర్పూ నేర్పూ. వ్యూహ చతురత. ఈ సుగుణాలే మనవాళ్లను ఉన్నత శిఖరాలపై నిలబెడుతున్నాయి. భారత సంతతికి చెందిన 12 మంది ఇప్పుడు ప్రపంచ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. వీరందరు పనిచేసే కంపెనీల మొత్తం టర్నోవర్ సుమారు 400 బిలియన్ డాలర్లు. అందుకే టైమ్స్ వంటి ప్రఖ్యాత మ్యాగజైన్ భారత్ సీఈవోలను ఎక్స్ పోర్ట్ చేస్తోందంటూ పొగడ్తలు కురిపించింది. భారత ఉపఖండాన్ని గ్లోబల్ బాస్ లకు ఒక శిక్షణా కేంద్రంగా పేర్కొంది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ యవనికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన పదిమంది గురించి ఇప్పుడు తెలసుకుందాం..

1/11 Pages

సుందర్‌ పిచాయ్‌, గూగుల్ సీఈవో

ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ భారత సంతతికి చెందిన 43 ఏళ్ల సుందర్‌ పిచ్చైను సీఈఓగా ప్రకటించింది. చెన్నైకి చెందిన సుందర్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఎంఎస్‌, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2004లో గూగుల్‌ సంస్థలో చేరిన సుందర్‌.. ఇప్పుడు సీఈవో స్థాయికి ఎదిగారు.

English summary

10 Indians who head global tech companies in the world. Proud to be Indian.