92 పైసల ప్రీమియం ... 10 లక్షల బీమా ...

10 lakh rupees rail travel insurance at just 92 paise

10:58 AM ON 27th August, 2016 By Mirchi Vilas

10 lakh rupees rail travel insurance at just 92 paise

రైల్వే ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ని రైల్వే శాఖ ప్రకటించింది. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం కలిగేలా ఈ ప్లాన్ రూపొందించారు. వివరాల్లోకి వెళ్తే, రైలు టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుపై, ప్రయాణికులకు పదిలక్షల వరకూ ప్రయాణ బీమా లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలులోకి వస్తుంది. ఐఆర్ టిసి వెబ్ సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఐచ్ఛిక ప్రాతిపదికన ఈ ప్రయాణ బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందట.

టికెట్ల బుకింగ్ సమయంలోనే కేవలం 92పైసలకే పది లక్షల బీమా పొందే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన బడ్జెట్ లో ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ బీమా సౌకర్యం వర్తించదు. మామూలు రైళ్లలో వెళ్లే వారికి ఏ తరగతిలో ప్రయాణం చేసినా కూడా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది.

అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు, విదేశీయులకు కూడా ఈ స్కీమ్ వర్తించదని రైల్వే వర్గాలు ధృవీకరించాయి. ఆర్ ఎసి, వెయిట్ లిస్టులో ఉన్నవారు మాత్రమే దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. రైలు ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగి సదరు ప్రయాణికుడు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా పదిల లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తారు.

పాక్షికంగా వైకల్యానికి గురైతే ఏడున్నర లక్షలు, ఆసుపత్రి ఖర్చుల కింద రెండు లక్షలు, ప్రమాదం జరిగిన స్థలం నుంచి మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు పదివేలు చెల్లిస్తారు. ఉగ్రవాద దాడి, దోపిడీ, కాల్పులు, దహనకాండ మొదలైన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. అయితే టికెట్ రద్దు చేసుకుంటే మాత్రం బీమా ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లించరట.

ఇది కూడా చూడండి: కూతుళ్ళతో స్టార్ హీరో డాన్స్

ఇది కూడా చూడండి: అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలతో పెళ్ళికి ఏ అబ్బాయి ఒప్పుకోడట

English summary

Railway Minister Suresh Prabhu announced ten lakh rupees rail travel insurance at just 92 paise from August 31.