చంపేస్తామంటూ నటి అపూర్వకు బెధిరింపులు..

10 members gave warning to hot actress Apoorva

09:34 AM ON 24th May, 2016 By Mirchi Vilas

10 members gave warning to hot actress Apoorva

పది మంది రౌడీలు సినీ నటి అపూర్వ ఇంటికి వచ్చి చంపేస్తామని బెధిరిస్తున్నారట. ఈ మేరకు సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు సోమవారం ఆమె ఫిర్యాదు చేసింది. మధురానగర్‌ సిద్దార్ధనగర్‌లో నివాసముండే అపూర్వ పలు సినిమాల్లో నటించారు. ఈనెల 21న అపూర్వ ఫిలింసిటీలో సినిమా షూటింగ్‌ ముగించుకొని వస్తుండగా కారుకు చిన్న ప్రమాదం జరిగింది. ఈ విషయం పై రెండు కార్లలో ఉన్నవారు గొడవ పడ్డారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సోమవారం పది మంది రౌడీలు తన ఇంటికొచ్చి కారు ప్రమాదం విషయమై నిలదీసి చంపేస్తామంటూ బెధిరించి వెళ్లారని ఫిర్యాదులో వివరించింది.

వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందని చెబుతున్న ఆమె, ఇంటికి వచ్చిన వారిని గతంలో ఎన్నడూ చూడలేదని మాత్రం చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary

10 members gave warning to hot actress Apoorva