ఇండియాలో భయంకరమైన ప్రదేశాలు

10 Most Haunted places in india

06:53 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

10 Most Haunted places in india

భారతదేశం ఎంతో అందమైన దేశం. అంతేకాకుండా ఎన్నో రహస్యాలు కూడా కలిగిన భారతదేశంలో ఎన్నో వింతలు, విచిత్రాలు, ఊహకి అందని ఎన్నో కధలు ఉన్నాయి. కంటికి కనిపించని రహస్యాలు చాలా ఉన్నాయి. రాజభవనాలు, కోటలు, రాజులు, రాకుమారి, సంపదలు, యుద్ధాలు ఇలా ఎన్నో చిక్కువిడవని కధలు ఉన్నాయి. అసలు ఆత్మలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు వస్తే చాలామంది లేవు అంతా భ్రమ అంటారు. కొందరయితే కచ్చితంగా ఉన్నాయి మేము కళ్ళరా చూసాం అని అంటారు. ఇలా కొన్ని మనదేశానికి సంభందించి ప్రశ్నార్ధకంగానే మిగిలాయి. మనదేశంలో కొన్ని ఊహకందని కధనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

1/11 Pages

10. టన్నెల్‌ నెం 33 : సిమ్లా

హిమాచల్‌ ప్రదేశ్‌లో బాగా ప్రసిద్ధి చెందిన అందమైన పట్టణం సిమ్లా. ఇంత అందమైన ప్రదేశంలో కూడా కొన్ని భయంకరమైన నీడలు వెంటాడుతున్నాయి. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. సిమ్లాలో టన్నెల్‌ నెం.33 లో ఒక దెయ్యం తిరుగుతుందని దానిపేరు కల్నల్‌ బరోగ్‌. ఇతడు బ్రిటిష్‌ రైల్వే ఇంజనీర్‌. ఇతడి ఆత్మ టన్నెల్‌ నెం.33 లో నివాసం ఉంటుందట. కాని అక్కడి ప్రజలు ఆ దెయ్యం స్నేహపూర్వకంగా ఉంటుందని ఎటువంటి హాని కలిగించదని చెప్పుకొచ్చారు. ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా దెయ్యం అంటే బయపడకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఆ టన్నెల్‌ సమీపంలో ప్రయాణికులు తలుచుకోని దేవుడుండడు.

English summary