బస్సు బోల్తా కొట్టి, 10 మంది మృతి(వీడియో)

10 people were died in bus accident

12:02 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

10 people were died in bus accident

ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది ఈ ప్రమాదంలో 10మంది మరణించారు. మరో 18మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ లోని మియాపూర్ నుంచి ఆదివారం రాత్రి యాత్రాజినీ బస్సు కాకినాడ బయలుదేరింది. తెల్లవారుజామున 2.30 గంటలకు నాయకన్ గూడెం వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి నాగార్జునసాగర్ ఎడమకాలువ వంతెనపై నుంచి బోల్తాపడింది. ఘటనా స్థలంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. 18 మంది క్షతగాత్రులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే ఉన్నారు. అతివేగం, డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో బోల్తాపడిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు బస్సులోంచి క్షతగాత్రులను బయటకు తీశారు.

3 అంబులెన్స్ ల్లో బాధితులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఎస్సీ షానావాజ్ ఖాసీం, డీఎస్పీ సురేశ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో కాల్వలోంచి బస్సును బయటకు తీశారు. దాదాపు 5గంటల పాటు సహాయకచర్యలు కొనసాగాయి.

1/5 Pages

డ్రైవర్ తప్పిదం వల్లే..


బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాద ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

English summary

10 people were died in bus accident. In khammam bus accident 10 people were died. Bus driver is the reason for this accident.