బరువు తగ్గడం ఎలా ?

10 steps to reduce weight

06:13 PM ON 24th November, 2015 By Mirchi Vilas

10 steps to reduce weight

సన్నగా నాజూకుగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందరూ సన్నగా అవ్వాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంత మంది తిండి తినడం కూడా మానుకుంటారు. కానీ దాని వల్ల లాభం ఉండదు. ఇంకా ఎక్కువగా బరువు పెరిగే అవకాశము ఉంది అంటున్నారు నిపుణులు. కొంతమంది డబ్బున్న వాళ్ళు కొవ్వు కరిగించుకోవడం, కోయించుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి లేనివారు ఎం చేయాలి అనే కదా మీ ఆలోచన.... అందుకే ఇంట్లో ఉంటూనే బరువు ఎలా తగ్గాలో కొన్ని చిట్కాలు చూద్దాం.

భారతీయుల వంటకాలు బహు అద్బుతముగా ఉంటాయండోయ్.. ముఖ్యముగా ముద్ద పప్పు నెయ్యి అందులో కొంచం ఆవకాయ తగిలిస్తే అబ్బో ఆ టేస్టే వేరు. మన వాళ్ళు నెయ్యి, పెరుగు , పాలు, పప్పు దినుసులు, పంచదార ఇలాంటివి తినడం వలన తొందరగా లావేక్కుతారు. కొంచెం లావు అయితే పర్వాలేదు కానీ, మరీ భారీ శరీరం ఉంటే అటు ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. లావుగా ఉన్న వారిని చూసి బాగా తింటారు, అందుకే అంత లావుగా ఉన్నారు అనుకుంటే మీ పోరపాటే. కొంతమంది వారి శరీర తత్వాన్ని బట్టి లావు గాను కొంతమంది సన్నగానూ ఉంటారు. కానీ కొంతమంది మద్య వయస్సు లో కొన్ని సంఘటనల వలన బరువు పెరుగుతారు. ఈ సమస్య గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇంట్లో నే ఉంటూ సులువైన పద్దతి లో బరువు తగ్గవచ్చు.

1. బ్రౌన్‌ రైస్‌

సామాన్యంగా భారతీయులు వైట్‌ రైస్‌కే ప్రాధాన్యత ఇస్తారు. దీంట్లో కార్బోహైడ్రేట్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. బ్రౌన్‌రైస్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఫైబర్‌ ఉంటుంది దాని వల్ల ఈ రైస్‌ని తక్కువ మోతాదులో తీసుకున్నా ఆకలి తీరిపోతుంది.

2. బీన్స్‌ మరియు పప్పు దినుసులు

బీన్స్‌,పప్పు దినుసులలో అధిక మోతాదులో ప్రొటీన్స్‌ ఉంటాయి. సోయా బీన్స్‌, బ్లాక్‌ బీన్స్‌ మొదలగునవి ఈ కోవకు చెందినవే. వీటిని ఆహారంగా సేవించడం వలన ఆకలిని తగ్గిస్తుంది. ఇవి బరువుని తగ్గించడంలో సహయపడతాయి. ఇంకా ఫీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని లేదా పప్పు దినుసులను అల్పాహారంగా సేవించడం మంచిది.

3. ఆకుకూరలు మరియు పాలకూర

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. భారత దేశంలో వివిద రాష్ట్రాలవారు వీటిని ప్రధాన ఆహారంగా సేవిస్తారు. గోంగూర, తోటకూర, మెంతుకూర, చుక్కకూర, పాలకూర ఇలా ఎన్నో రకాల ఆకు కూరలు వాడుకలో ఉన్నాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో ఫైబర్‌, ఫోలేట్‌ ఉంటుంది. వీటిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది తక్కువ శాతం కేలరీలు ఉంటాయి. ఇవి అరుగుదలను పెంచి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది. బ్రోకలి,క్యాబేజి కూడా బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

4. దోసకాయలు

భారత దేశంలో చాలా రకాల దోసకాయలు ఉన్నాయి. ఇవి బరువును తగ్గించడంలో అద్బుతంగా పని చేస్తాయి. దోసకాయలో నీరు శాతం అధికంగా ఉంటుంది. దీనిలో తక్కువ మోతాదులో కేలరీలు ఉంటాయి. వీటిని సేవించడం వలన ఆహారంలో అదనపు కేలరీలు లేకుండా ఆకలి తీరుస్తుంది.

5. అల్లం

శరీరంలో కొలస్ట్రాల్‌ని, ఆకలిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. గుండెకు సంబంధించిన వ్యాదులు, క్యాన్సర్‌ నిరోదించడంలో సహాయపడుతుంది.

6. తృణధాన్యాలు

ఎక్కువ మోతాదులో ఫైబర్‌ కలిగి తక్కువ మోతాదులో కొవ్వుని కలిగి ఉంటాయి. ఈ తృణధాన్యాలు ప్రొటీన్‌, మినరల్స్, విటమిన్స్‌, ఆంటీ ఆక్సీడెంట్స్‌, ఫైటోకెమికల్స్‌ కలిగిన ఆరోగ్యకరమైన ధాన్యాలు.

7. కాయలు మరియు గింజలు

వేరుశెనగ పప్పు, బాదంపప్పు మొదలగునవి. చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో అధిక మోతాదులో ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్‌ కలిగి ఉంటుంది.

8. చేప

మీరు నాన్‌ వెజిటీరియన్‌ అయితే కనుక వారానికి 2 లేదా 3 సార్లు ఆహారంగా తీసుకోవాలి. చేపలో ప్రొటిన్‌ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్‌లు అధికమోతాదులో ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. నూనెలో వేపిన చేపలను తినకుండా ఉండమే మంచిది.

9. పండ్లు మరియు కూరగాయలు

క్యాబేజి, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, టమాటాలు తక్కువ కేలరీలను కలిగిఉంటాయి. అలాగే నిమ్మకాయ, ద్రాక్షపండ్లు, ఆపిల్‌, నారింజకాయ, స్ట్రాబెర్లీ, పుచ్చకాయ, మొదలగు వాటిలో తక్కువ కాలరీలు ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వలన బరువు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. రోజూ తప్పని సరిగా మీరు తినే ఆహారంలో వీటిని ఉండేలా చూసుకోవాలి.

10. ఆరోగ్యకరమైన సుగంధద్రవ్యాలు

బరువు తగ్గాలి అని ఆశపడేవారు ఈ విదం గా అనుసరించడం మంచిది. మీరు తయారు చేసుకునే ఆహారపదార్ధాలలో దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర,అల్లం, ఆవాలు, పసుపు మరియు నల్ల మిరియాలు చేర్చి వాడడం వలన బరువు సులభంగాతగ్గవచ్చు.

ఇలా ఇంట్లో లభించే వాటితోనే బరువు సులభంగా తగ్గవచ్చు. ఈ పద్ధతులను అప్పుడప్పుడు కాకుండా రోజూ పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 steps to reduce weight. Using home made products to reduce weight in few days. Those products are easily available all category people.