'బాజీరావ్‌'కి అవార్డుల పంట

10 Zee Cine Awards For Bajirao Mastani

10:03 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

10 Zee Cine Awards For Bajirao Mastani

ముంబయిలో ‘జీ సినీ అవార్డ్స్‌’ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, పరిణీతి చోప్రా, ఈషా గుప్తా, సోనమ్‌కపూర్‌, ఇంకా పలువురు బాలీవుడ్‌ నటులు పాల్గొని సందడి చేశారు. మొత్తానికి అనుకున్నట్టు గానే రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా జంటగా నటించిన బాజీరావ్‌ మస్తానీకి అవార్డుల పంట పండింది. ముంబయిలో జరిగిన ‘జీ సినీ అవార్డ్స్‌’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉత్తమ చిత్రం (జ్యూరీ), ఉత్తమ దర్శకుడు, నటుడు, నటి సహా 10 అవార్డులు బాజీరావ్‌ మస్తానీకే వచ్చేసాయి.

ఇక కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ బజరంగీ భాయ్‌జాన్‌ చిత్రానికి ఉత్తమ నటుడు(వ్యూవర్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకున్నాడు. పీకూ సినిమాలో అద్భుత నటన కనబరిచిన బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి ఉత్తమ నటుడు(జ్యూరీ) అవార్డు దక్కింది.

English summary

Director Sanjay Leela Bhansali's 2015’s hit Bajirao Mastani grabbing 10 awards, beating Salman Khan-starrer hits ‘Bajrangi Bhaijaan' and `Prem Ratan Dhan Payo.Bajirao Mastani won Jury Award for Best Film, Best Actor, Best Director and Best Actress (Viewers' Choice) awards.