జీమెయిల్@వందకోట్లు

100 Crore Monthly Users For Gmail

11:24 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

100 Crore Monthly Users For Gmail

జీమెయిల్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ఈమెయిల్ సర్వీస్. జీమెయిల్‌ కొత్త మైలురాయిని చేరుకుంది. జీమెయిల్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్లు 1 బిలియన్‌(వంద కోట్ల)కు చేరుకున్నారని గూగుల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్‌ను వంద కోట్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారని స్పష్టంచేసింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ నాలుగో త్రైమాసికంలో అధిక వృద్ధిరేటును నమోదు చేసి యాపిల్‌ సంస్థను అధిగమించింది. గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే గత త్రైమాసికంలో జీమెయిల్‌ బిలియన్‌ యాక్టివ్‌ వినియోగదారుల మైలురాయికి చేరిందని తెలిపారు. 2004లో జీమెయిల్‌ ప్రారంభించగా.. 2015 మే నాటికి 900 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. తాజాగా వినియోగదారులు బిలియన్‌కు చేరారు.

English summary

Google's famous service Gmail Reached a new milestone. Gmail reached 100 crores of monthly users every month.Google CEO Sundar Pichai said about company’s mail service crossing the milestone last quarter and Gmail is now the seventh Google product with over billion users.