రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

100 Crores Budget For Robo 2 Graphics

09:27 AM ON 10th May, 2016 By Mirchi Vilas

100 Crores Budget For Robo 2 Graphics

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ''రోబో'' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే . ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న'"రోబో 2.0" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా , ఏ.ఆర్.రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు . బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండడం మరో విశేషం.

ఇవి కూడా చదవండి:పోస్టర్ తోనే హీటెక్కిస్తున్న నాని హీరోయిన్

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో , అందమైన లోకేషన్స్‌లో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్ . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో 2.0 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి.

ఇందు కోసం ఏకంగా 100 కోట్లను నిర్మాతలు కూడా ఈ చిత్రం విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా , ఎంతటి ఖర్చుకైనా వెనకాడడం లేదు . ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం మొత్తం ఏడు పేరు మోసిన సంస్థల నుంచి వందల మంది బృందాలుగా ఏర్పడి పనులు మొదలుపెడుతున్నారు. ప్రముఖ లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి:పవన్ చివరి సినిమా డైరెక్టర్ ఇతనేనా?

ఇవి కూడా చదవండి:ఆస్కార్ విజేత తో మంచు లక్ష్మి హాలీవుడ్ సినిమా

English summary

South Super Star Rajini Kanth was acting in Robo 2.0 movie under the direction of Shankar. This movie was making with huge budget and a recent update came to know that Shankar was spending 100 crores to Visual affects in the Movie.