సన్నీ పై 100 కోట్లు దావా వేసిన పూజా మిశ్రా

100 crores Defamation suit on Sunny Leone

10:40 AM ON 6th April, 2016 By Mirchi Vilas

100 crores Defamation suit on Sunny Leone

ఈ మధ్య సినీ తారల నడుమ కోర్టు వివాదాలు ఎక్కువయ్యాయి. ఇక బ్యూటీ ల నడుమ కూడా అదే పరిస్థితి. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ పై మోడల్‌ పూజా మిశ్రా పరువు నష్టం దావా వేసింది. ఏకంగా రూ. 100 కోట్లకు దావా వేసింది. తన పరువు ప్రతిష్టలను దెబ్బ తీసి, ఆర్థికంగా నష్టం కలిగించినందుకు ఈ మొత్తాన్ని తనకు కట్టాలని మిశ్రా ఆ పిటిషన్‌లో పేర్కొంది. గతంలో బిగ్‌బాస్ రియాల్టీ షోలో పూజా మిశ్రా తో పాటు సన్నీ లియోన్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ సందర్భంగా తన పరువు నష్టం కలిగించే విధంగా సన్నీ‌లియోన్ మీడియాకు ఇంటర్‌వ్యూ లను ఇచ్చిందని మిశ్రా చేస్తున్న మెయిన్ ఆరోపణ.

ఈ పరిణామాల కారణంగా తన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌, బ్యాంకు పొదుపులను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని, ఫలితంగా రూ. 70 లక్షల నష్టం వాటిల్లినట్టు మోడల్ పూజా ప్రస్తావించింది. సన్నీ లియోన్ పై ఐపీసీ సెక్షన్లు 500 (పరువు నష్టం), 120 బీ (కుట్ర) అభియోగాలతో చర్యలు చేపట్టాలని ఆమె కోరింది. మరోవైపు బొంబే హైకోర్టు డివిజన్ బెంచ్‌ వేసవి సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. మరి సన్నీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary

100 crores Defamation suit on Sunny Leone. Pooja Mishra put 100 crores Defamation suit on Sunny Leone.