ఆ ఖాతాలను 2 పైసల చొప్పున అమ్మేశారట!

100 Crores Yahoo Accounts Hacked

10:53 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

100 Crores Yahoo Accounts Hacked

సినీ ఇండస్ట్రీకి పైరసీ భూతం ఎలాగో , సోషల్ మీడియా, మెయిల్స్ వంటి ఏక్కౌంట్స్ కి హాక్యింగ్ సమస్య అలా కొరకరాని కొయ్యగా తయారైంది. ముఖ్యంగా 2013లో దాదాపు 100 కోట్ల మంది ఖాతాల వివరాలను హ్యాకర్లు చోరీ చేశారని ఇటీవల యాహూ సంస్థ ధృవీకరించింది. ఈ విధంగా కోట్ల మంది యాహూ వినియోగదారుల ఖాతాలు హ్యాకింగ్ కు గురైన విషయం యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది.. మరి అపహరణకు గురైన వివరాలను సైబర్ నేరగాళ్లు ఏం చేశారో తెలుసా? తెలిస్తే మరోసారి ఉలిక్కిపడాల్సిందే. అంతమంది ఈమెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ లు సహా వ్యక్తిగత వివరాలన్నింటినీ ఒక్కో ఖాతాకు 2 పైసల చొప్పున ఆన్ లైన్ లో అమ్మేశారట. అది కూడా ఒక్కసారి కాదు.. పలుమార్లు ఓ డార్క్ వెబ్ సైట్ లో హ్యాకర్లు అమ్మేసి సొమ్ము చేసుకున్నారట. ఈ విషయాన్ని అమెరికాలోని ‘ఇన్ఫోఆర్మర్ ’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.

యాహూ ఖాతాదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్ట్ వర్డ్ లు, పుట్టిన తేదీలు, ఫోన్ నంబర్లు, సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అన్నింటినీ హ్యాకర్లు చోరీ చేశారట. ఆ డేటాబేస్ ను మొత్తం మూడు లక్షల డాలర్లకు(సుమారు రూ.2 కోట్ల 4 లక్షలు)కు గతేడాది ఆగస్టులో ఓ వెబ్ సైట్ లో పెట్టి అమ్మినట్లు ‘ఇన్ఫోఆర్మర్ ’ సంస్థ చీఫ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ అండ్య్రూ కొమరో న్యూయార్క్ టైమ్స్ పత్రికకు వెల్లడించారు. అంటే ఒక్కో ఖాతా వివరాలను కేవలం (0.003 డాలర్ ) 2 పైసలకే అమ్మారన్నమాట. ఆ వివరాలను ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించామని తెలిపారు.

2014లోనూ దాదాపు 50 కోట్ల యాహూ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వాటితో కలిపి పూర్తి డేటాబేస్ ఇప్పటికీ ఆ వెబ్ సైట్ లో అమ్మకానికి ఉందని ఆండ్య్రూ చెబుతున్నారు. ప్రస్తుతం ఆ డేటాబేస్ మొత్తం 13లక్షల 61వేలకే అమ్ముతున్నారని తెలిపారు.

యాహూ ఖాతాదారులంతా తక్షణమే తమ యూజర్ ఐడీలు.. పాస్ వర్డ్ లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఎందుకు ఆలస్యం యాహూలో మీకూ ఖాతా ఉంటే వెంటనే అప్రమత్తం గా వ్యవహరించండి. లేకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది.

ఇవి కూడా చదవండి: ఫేస్ బుక్ ప్రియులకు ఇక పండగే

ఇవి కూడా చదవండి: ఈ మహిళ తల తీసుకొస్తే, 7 కోట్లు ఇస్తారట

English summary

One of the Cyber Security firm has announced that 100 crores of Yahoo accounts have been hacked by the hackers and they have sold each account for just 2 paisa.