'సర్దార్‌' లో 100 గుర్రాలతో ఫైటా ?

100 Horses Fight Scene In Sardar Gabbar Singh

03:57 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

100 Horses Fight Scene In Sardar Gabbar Singh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ప్రెస్టీజయస్‌ చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ కె.ఎస్‌. రవీందర్‌ తెకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌ స్నేహితుడు శరత్‌ మరార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ ,సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించి రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకొస్తుంది. అదేంటంటే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ఒక భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైటింగ్‌ సీక్వెన్స్‌లో దాదాపు 100 గుర్రాలని ఉపయోగిస్తున్నారట. ఆ గుర్రాలని అదుపు చెయ్యడానికి హార్స్‌మెన్స్‌, వారితో పాటు యాక్టర్లు, జూ.యాక్టర్లు మొత్తం 1000 మందికి పైగా ఈ షూటింగ్‌ లో పాల్గొంటున్నారట. ఈ ఫైటింగ్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌ గా నిలుస్తుందని సమాచారం.

English summary

Pawan Kalyan's upcoming movie was Sardar Gabbar Singh.This movie was full of action and entertainment.Recently another news was known about this movie that there was a Fight scene With 100 Horses.