20 రూపాయలకే 100 ఛానెల్స్

100 tv channels for only 20 rupees

10:33 AM ON 24th June, 2016 By Mirchi Vilas

100 tv channels for only 20 rupees

ఇది టీవీ ప్రపంచం. లెక్కకు మించి టీవీ ఛానెల్స్.. అందులో ఒకరికొకరు పోటీపడే ప్రోగ్రామ్స్... ఈ టీవీ ఛానెల్స్ అన్నీ చూడాలంటే రోజుకి 24 గంటల సమయం చాలదని అంటూంటారు. ఇక రోజుకో కొత్త ఫోన్ రోజుకో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటికి కావాల్సిన కూరగాయల దగ్గర నుండి ఇంట్లోకి కావాల్సిన పెద్ద పెద్ద వస్తువుల వరకు ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం ప్రపంచాన్నే ఇంట్లో చూడచ్చు. అలాగే ఇప్పుడు టీవీ సీరియల్ చూడాలనుకుంటే ఆ టైంకే చూడాలని ఏమీ లేదు ఎప్పుడైనా చూడచ్చు. అది మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో....

ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ ఇప్పుడు దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. వాటిలో భాగంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న జీ గ్రూపు డిట్టో టీవీ పేరుతో స్మార్ట్ ఫోన్ యూజర్లకు తక్కువ ధరకే టీవీ ఛానళ్ల ప్రసారాలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో నెలకు 20 రూపాయలకే 100కు పైగా టీవీ ఛానళ్ల ప్రసారాలను అందుకోవచ్చు. దేశంలో 14.5 కోట్ల టెలివిజన్లు ఉండగా, అంతకు ఎన్నో రెట్లు స్మార్ట్ ఫోన్ యూజర్ల ఉన్న విషయాన్ని కంపెనీలు గుర్తించాయి.

జీ గ్రూపు సిటీ కేబుల్, ఐడియా సెల్యులర్ నెట్ వర్క్ లతో భాగస్వామ్యం కుదుర్చుకుని డిట్టో టీవీ ప్రసారాలను అందిస్తోంది. డిట్టో టీవీ ఛానెల్ నెలకు చందా 20 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. ఐడియా 3జీ, 4జీ చందాదారులు నెలవారీ డేటా ప్యాక్ తో ఉచితంగా డిట్టో టీవీ చందాదారులుగా చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లపై డిట్టో టీవీ అందుబాటులో ఉంచినట్టు జీ గ్రూపు ప్రకటించింది. మూడు నెలలకు రూ. 50, ఆరు నెలలకు రూ.90, ఏడాది చందా రూ.170గా తెలిపింది. డిట్టో టీవీ యాప్ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా టీవీ ప్రసారాలను చూసుకోవచ్చని కంపెనీ అంటోంది.

అసలే స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని ఒకటే చాంటింగ్ లతో మునిగి తేలుతున్న వారికి ఈ ఛానల్స్ తో మరింత ఎడిట్ అయిపోతారని అంటున్నారు.

English summary

100 tv channels for only 20 rupees