వామ్మో.. షుగర్ ఫ్యాక్టరీలో వెయ్యి విషనాగులు(వీడియో)

1000 snakes found in sugar factory

06:39 PM ON 27th July, 2016 By Mirchi Vilas

1000 snakes found in sugar factory

విషం చిమ్మే నాగుపాము ఒక్కటి కనబడితేనే తట్టుకోలేం. అలాంటిది వెయ్యి విషనాగులు ఉంటే ఇంక ఏమైనా ఉందా? ఇటీవల కాలంలో ఓ ఇంటి గోడలో కుప్పలుకొద్దీ పాములు కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాని సంగతి పక్కనపెడితే, ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 1000 పాములు ఉన్నాయట. ఇది చూసి, చుట్టుపక్కల వాళ్ళు, వామ్మో అంటూ, తెగ భయపడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే వివరాల్లోకి పోవాల్సిందే.. తమిళనాడు కాంచీపురం జిల్లా మధురాంతకంలో 60 ఏళ్ల కిందట సుమారు 20 ఎకరాల్లో ఫ్యాక్టరీ స్థాపించారు. కొన్నాళ్లు కిందట మూతపడింది. దీంతో వేలకొద్దీ పాములు చక్కెర ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నాయి. ఇక ఎలాంటి జనసంచారం లేకపోవడంతో పాములన్నీ అక్కడే మకాం పెట్టేశాయి.

అయితే ఆరేళ్ల కిందట డీఎంకే రూలింగ్ లో షుగర్ ఫ్యాక్టరీ తెరచుకుంది. కర్మాగారం ఓపెన్ చేసారు. అయినా సరే పాముల బెడద తప్పలేదు. మూడు షిఫ్టుల్లో అక్కడి పనిచేసే ఉద్యోగులు.. ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని డ్యూటీకి హాజరవుతున్నారు. రోజురోజుకూ వీటి బెడద ఎక్కువ కావడంతో సంబంధిత అధికారులు.. వన్యప్రాణి విభాగం అధికారుల సాయంతో పాములను పట్టేవాళ్లను రప్పించారు. 10 మందితో కూడిన పాములు పట్టే బృందం సోమ, మంగళవారాల్లో రకరకాల జాతులకు చెందిన వెయ్యికిపైగా పాములను ఒడిసి పట్టేసింది. పట్టుబడిన పాములను గోనె సంచిలో వేసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారట.

English summary

1000 snakes found in sugar factory