రైల్వేస్టేషన్లలో వెయ్యి వాటర్ ప్యూరిఫైయర్లు

1,000 water purifiers at Indian Railway stations

10:58 AM ON 6th February, 2016 By Mirchi Vilas

1,000 water purifiers at Indian Railway stations

రైల్వే శాఖతో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఎస్ బ్యాంక్ చేతులు కలిపింది. రైల్వేస్టేషన్లలో వాటర్ ప్యూరిఫైయర్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2019 కల్లా దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో వెయ్యి మంచినీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయడానికి ఈ రెండింటి మధ్యా ఒప్పందం కుదురింది. రైల్వే ప్రయాణికులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ఇండియన్‌ రైల్వేస్‌తో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా అయినట్లు ఎస్‌ బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు. మార్చి నెలలోపు మహారాష్ట్రలోని డి, ఈ కేటగిరిలోని రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.

English summary

Yes Bank has joined hands with the Indian Railways to provide safe and clean drinking water by setting up 1,000 community water purification systems across railway stations in the country by 2019.