నో టిక్కెట్‌.. రూ.104 కోట్లు ఫైన్

104 Crores Fine By Railway

11:37 AM ON 17th February, 2016 By Mirchi Vilas

104 Crores Fine By Railway

‘టిక్కెట్‌ లేని ప్రయాణం నేరం. అందుకు రూ.500 జరిమానా’ ఈ బోర్డులు మనకు ప్రతి రైలులోనూ కనిపిస్తాయి. కానీ.. దీనిని పాటించేవారు ఎంత మంది అంటే.. డౌటే. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతోంది. టిక్కెట్‌ లేని రైలు ప్రయాణికుల నుంచి పది నెలల్లో సెంట్రల్‌ రైల్వే రూ.104 కోట్లు జరిమానా కట్టించుకుందట. ఏప్రిల్‌ 2015 నుంచి జనవరి 2016 మధ్య కాలంలో టిక్కెట్‌ లేని 20.17 లక్షల కేసులను సెంట్రల్‌ రైల్వే ప్రత్యేక డ్రైవ్‌లో గుర్తించింది. వీరి వద్ద నుంచి రూ.103.95 కోట్లు వసూలు చేశారు. అంతకు ముందు ఏడాది 17.91 లక్షల కేసుల్లో రూ.85.39 కోట్లు రాబట్టారు.

English summary

Central Railway (CR) has collected Rs 103.95 crore from ticket less travelers in the last ten months as part of its special drive.From April 2015 to January 2016, a total of 20.74 lakh cases of ticketless travellers were detected as against 17.91 lakh cases during the corresponding period last year, registering an increase of 15.82% in number of cases