దారుణం.. 10th క్లాస్ అమ్మాయిని 12 మంది రేప్ చేశారు

10th class girl raped by 12 members in Kerala

05:39 PM ON 6th April, 2016 By Mirchi Vilas

10th class girl raped by 12 members in Kerala

రోజు రోజూకు సమాజంలో దారుణాలు అత్యంత కిరాతకంగా జరుగుతన్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోయి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక పై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా సరిహద్దుల్లోని అత్తింగర్ గ్రామంలో చోటు చేసుకుంది. 15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలిక కుటుంబాన్ని పోషించడం కోసం చదువుకుంటూనే రికార్డింగ్ డ్యాన్సర్‌గా పని చేస్తుంది. అయితే, గత నెలలో తన మామయ్య స్నేహితులు అమీర్, అనూప్ షాలు ఆమెను ఆటోలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి... లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: పవన్-కాజల్ మధ్య హాట్ లిప్ లాక్(వీడియో)

ఆ తర్వాత వరుసగా రెండు నెలలు పాటు ఆ బాలిక పై 12 మంది ప్రతి రోజు లైంగిక దాడి చేస్తూ నరకం చూపించారు. వీరి నుంచి బయటపడిన ఆ బాలిక గ్రామస్థులకు సమాచారం చేరవేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఏడుగురును పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చేపట్టారు.

ఇది కూడా చదవండి: అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

English summary

10th class girl raped by 12 members in Kerala. 12 members raped a 15 years girl in Tamil Nadu, Thiruvananthapuram.