సిగరెట్లు కాలుస్తూ బతికున్న శతాధిక వృద్ధురాలు

112 Years Old Woman Smokes 30 Cigarettes Dialy

10:01 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

112 Years Old Woman Smokes 30 Cigarettes Dialy

నిజమా, అబద్దమా అంటే నిజమేనని ఈ బామ్మ చెబుతోంది. సిగరెట్ తాగడం వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తాయని తమ దగ్గర ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన డాక్టర్లు పొగరాయుళ్లను డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉంటారు. ‘స్మోకింగ్ కిల్స్‌’.. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్’ అంటూ హెచ్చరించే ప్రభుత్వ ప్రకటనలూ మనం చూస్తూన్నాం! అయితే దీనికి పూర్తి విరుద్ధంగా వుంది 112 ఏళ్ల నేపాలీ బామ్మ వాదన. కేవలం సిగరెట్లు త్రాగడం వల్లే తాను ఇన్నాళ్లు బ్రతికున్నానని అంటోంది. సిగరెట్లు తాగడం వలన తనకు ప్రశాంతత చేకూరుతోందని.. అందుకే, ఈ వయసులో కూడా చురుగ్గా ఉండగలుగుతున్నానని చెబుతోంది. ఆసక్తికరమైన ఈ అంశం గురించి తెల్సుకోవాలంటే, పూర్తి వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి ....

నేపాల్ కు చెందిన బటూలీ లామిచ్చెనే అనే మహిళ రోజుకు అక్షరాలా 30 సిగరెట్లును అవలీలగా కాల్చి పారేస్తుందట. ఇలా ఒకటి రెండేళ్ళు కాదు ఏకంగా గత వందేళ్లుగా ఇదే తంతు. సిగరెట్ మీద సిగరెట్ ‘ఉఫ్’ అంటూ ఊదేస్తుంది. 1903 మార్చి నెలలో లో పుట్టిన ఈమె ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉంటూ తన పనులన్నీ తాను స్వయంగా చేసుకుంటుందట. బటూలీకి నలుగురు సంతానం. వీరిలో 85 ఏళ్ల పెద్ద కొడుకు మినహా మిగతా వారు ఇప్పటికే కాలం చేశారు.

తాను చాలా చిన్నప్పటి నుంచే సిగరెట్లు త్రాగుతున్నానని.. సిగరెట్లు త్రాగడం తప్పేమి కాదని ఆమె డంకా బజాయించి మరీ చెబుతోంది. ఇక సిగరెట్లు కాల్చడంలో కూడా ఈ బామ్మ స్టైల్ కూడా వెరైటీయే. సాధారణంగా, అందరూ రెండు వేళ్ల మధ్య సిగరెట్టును ఉంచి త్రాగుతాంటారు, కానీ, ఈమె మాత్రం గుప్పిట్లో సిగరెట్‌ను ఉంచి ఉఫ్ ఉఫ్ అంటూ ఊది పారేస్తుంది. నేటి ఆధునిక కాలంలో మనుషులు చాలా ఒత్తిడితో బ్రతుకుతున్నారని.. అలాగే, కాస్త వయసు మీద పడగానే ఎటువంటి పని చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నారని.. ఎటువంటి వ్యాపకం లేదా పని లేకుండా ఖాళీగా కూర్చోవడం వల్ల మానసిక, శారీరక సమస్యలు వస్తాయని ఆమె అంటోంది. తనలా ఎక్కువకాలం బ్రతకాలంటే.. రోజూ ఏదో ఒక పని లేదా వ్యాపకం పెట్టుకోవాలని.. ఒత్తిడి లేకుండా సంతోషంగా, ప్రశాంతంగా బ్రతకాలని ఆమె సలహా కూడా ఇస్తోంది. అయితే, సాదా సీదా గా సిగరెట్లు తాగానే తాగదు. కమర్షియల్‌ బ్రాండ్ సిగరెట్లు తాగకుండా, స్థానికంగా పొగాకుతో తయారుచేసి.. బీడీ ఆకులతో చుట్టబడిన సిగరెట్లే త్రాగుతానని ఆమె స్పష్టం చేసింది. అలాగే, తన వయసు ఎంత అనే విషయాన్ని తాను అసలు పట్టించుకోనని.. తన జీవితకాలంలో అనేక మార్పులను తాను చూశానని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి వాళ్ళు ఇలా చెబుతుంటే, మరి ఎవరు మాత్రం ఏమి చేస్తారు? అయినా ఆమె కోణంలో ఆలోచిస్తే పోలే ...

English summary