పోలీసులతో సహా 113 మంది రేప్ చేసారు

113 members rapes a 16 years girl in Delhi

11:50 AM ON 19th April, 2016 By Mirchi Vilas

113 members rapes a 16 years girl in Delhi

ఆ 16 ఏళ్ల బాలిక‌ను కొంద‌రు దుర్మార్గులు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని ఆశ చూపించి బ‌ల‌వంతంగా వ్య‌భిచారం రొచ్చులోకి దింపారు. చివ‌ర‌కు రెండు సంవ‌త్స‌రాల పాటు పూణేలో వ్య‌భిచార కొంప‌ల్లో తిరిగిన ఆ బాలిక ఆ కామాంధుల నుండి త‌ప్పించుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బెంగాల్‌కు చెందిన 16 సంవ‌త్స‌రాల బాలిక‌ను కొంద‌రు ఉద్యోగం ఇప్పిస్తామని మహారాష్ట్రలోని పూణే కి తీసుకు వ‌చ్చారు. అక్క‌డ ఆమెను బ‌ల‌వంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. అయితే ఇక్కడ మరో దారుణం ఏంటంటే ఆ బాలికను కొందరు పోలీసులతో సహా 113 మంది తన పై అత్యాచారం చేశారని ఆ బాలిక విలపిస్తుంది.

అయితే ఎలాగోలా ఆ కామాంధుల బారి నుంచి త‌ప్పించుకున్న ఆమె ఢిల్లీ పారిపోయి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఇప్పుడు తాజాగా పూణేకు బదిలీ చేసి, 113 మంది పై ఎఫ్ఐఆర్ రాసారు. ఈ కేసులో 26 ఏళ్ల మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పూణేలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న భండారీ అనే వ్య‌క్తి బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి ఆ బాలిక‌ను పూణే తీసుకు వ‌చ్చాడు. బాలిక‌ అమ్మమ్మకు టీ కొట్టు ఉండగా, అక్కడకు భండారీ తరచూ వచ్చి సిగరెట్లు కొనుక్కునేవాడు. అప్పుడే ఈ బాలికను చూసి, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2014 జనవరిలో పూణే తీసుకెళ్లాడు.

త‌ర్వాత ఆమె పై అత్యాచారం చేయ‌డంతో పాటు ఆమెను వ్యభిచారంలోకి దింపాడు. డ్రగ్స్ మరియు మత్తు మందు ఇచ్చి ఒకేసారి చాల మందితో వ్యభిచారం చేయించేవాడు. ఢిల్లీ నుంచి వచ్చిన 24 ఏళ్ల మోడల్‌తో కలిసి ఆ బాలిక ఢిల్లీ పారిపోయింది. చివరకు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.

English summary

113 members rapes a 16 years girl in Delhi. In New Delhi the case was filed in police station. A 16 years gilr gave a complaint on rapists. Including Pune police 113 members were raped that 16 years girl in Pune.