కలీస్‌కు బంపర్‌ ఆఫర్‌

1.17 Crore offer for Jacques Kallis

01:10 PM ON 8th December, 2015 By Mirchi Vilas

1.17 Crore offer for Jacques Kallis

దుబాయ్‌ దేశంలో జనవరి నెలలో జరుగునున్న 'మాస్టర్స్ ఛాంపియన్‌ లీగ్‌' కు సంభందించిన ఆటగాళ్ళ వేలం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌ ఆల్‌-రౌండర్‌ జాక్వెస్‌కలిస్‌ను 1.75 కోట్లు వెచ్చించి లిబ్రా లెజెండ్స్‌ జట్టు కైవసం చేసుకుంది. అనేక అంతర్జాతీయ ఆటగాళ్ళు పాల్గొన్న ఈ వేలంలో కలిస్‌ కు కళ్ళు చెదిరే మొత్తం లభించింది. కలిస్‌ తరువాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ వికెట్‌ కీపర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ 1.14 కోట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. గిల్‌క్రిస్ట్‌ ను సగిట్టరియస్‌ సోల్జర్స్‌ జట్టు సొంతం చేసుకుంది. వెస్టిండిస్‌ దిగ్గజం బ్రెయిన్‌ లారాను 66.76 లక్షలకు, మాజీ ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ పాల్‌ కాలింగ్‌ వుడ్‌ ను 93.50 లక్షలకు కాప్రికాన్‌ కామండర్స్‌ జట్టు సొంతం చేసుకుంది.

యూఎఈ వేదికగా జరగనున్న ఈ మాస్టర్స్‌ ఛాంపియన్స్‌ టి20 లీగ్‌లో మొత్తం ఆరు జట్లు బరిలో దిగనున్నాయి.ఈ టోర్నిలో ఒక్కో జట్టులో ఇద్దరేసి ఆటగాళ్ళకు దిగ్గజ హోదా ఉంటుంది. అనేక మంది రిటైర్డ్‌ ఆటగాళ్ళు అయిన సౌరవ్‌గంగూలి, విరేంద్రనెహ్వాగ్‌, అబ్దుల్‌ రజాక్‌, మైకెల్‌ వాన్‌, స్కాట్‌ స్టైరిస్‌, హెత్‌ స్ట్రీక్‌, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, బ్రెట్‌లీ, డానియల్‌ వెటోరి, గ్రేమ్‌ సిల్మ్‌ వంటి మాజీ ఆటగాళ్ళ ఈ టోర్నమెంటులో వివిధ జట్లకు ఆడనున్నారు.

English summary

South Africa legendary player Jacques Kallis has sold for a huge ammount of 1.17 crore in Masters Champions League which is to be held on 2016 january