ఒక్కరోజే... ఆ ధియేటర్ లో కబాలి 119 షోలు

119 shows in Mayajal multiplex for Kabali movie

11:50 AM ON 21st July, 2016 By Mirchi Vilas

119 shows in Mayajal multiplex for Kabali movie

నిజం, సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన 'కబాలి' ఫీవర్ అలాంటిదే. అందుకే ఈ తతంగమంతా... లేకపోతే ఎంత మల్టీప్లెక్స్ అయితే మాత్రం, అక్కడ ఎక్కువ స్క్రీన్లే ఉంటే మాత్రం మరీ ఒకే రోజు ఒక సినిమా 119 షోలుగా ప్రదర్శించడం మామూలు విషయం కాదుగా... ఈ విచిత్రంగా 'కబాలి' సినిమా విషయంలో ఈ అద్భుతం జరగబోతోంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఇంక ఎక్కడ చెన్నైలోని 'మాయాజల్' మల్టీప్లెక్సులో 22వ తేదీ శుక్రవారం ఏకంగా 119 షోలు కబాలిని ప్రదర్శించబోతున్నారు. చెన్నైలోని మరో ప్రముఖ మల్టీప్లెక్స్ 'సత్యం' కూడా 99 షోలతో రికార్డు స్థాయిలో కబాలి స్క్రీనింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇప్పటిదాకా సత్యం మల్టీప్లెక్సులో గరిష్టంగా ఒక రోజు ఒక సినిమాకు 50 షోలు మాత్రమే వేశారట. ఇప్పుడు కబాలి సినిమాకు దానికి రెట్టింపు స్థాయిలో షోలు వేయబోతున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ మల్టీప్లెక్సుల్లో ఉన్న అన్ని స్క్రీన్లలోనూ కబాలి సినిమానే ప్రదర్శించబోతున్నారు. చెన్నై నగరంలో దాదాపు 90 శాతం స్క్రీన్లలో కబాలి సందడి చేయబోతోంది. తమిళనాడు అంతటా శుక్రవారం కబాలి సందడే కనిపించబోతోంది. కబాలి ద్వారా మ్యాగ్జిమం లాభం పొందేందుకు డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు చేయాల్సిందంతా చేస్తున్నారు. వేరే సినిమాల్ని కూడా తీసేసి ఫస్ట్ వీకెండ్ అంతా కబాలినే ఆడించబోతున్నారు.

అన్ని చోట్లా టికెట్ల రేట్లు పెరిగిపోయాయి. థియేటర్ల దగ్గర టికెట్లు కొని బ్లాకులో వేలకు వేలు పెట్టి అమ్ముకుంటున్న వాళ్లకు లెక్కే లేదు. చెన్నైలోని కాశి థియేటర్లలో ఉదయం నాలుగు గంటలకు ఓ షో వేయబోతున్నారు. దాని టికెట్ రేటు రూ.2400 పెట్టి అఫీషియల్గానే అమ్ముతుండటం విశేషం. మొత్తానికి కబాలి సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.

English summary

119 shows in Mayajal multiplex for Kabali movie