ఏపీలో 12మంది ఐపీఎస్‌ల బదిలీ

12 IPS Officers Transferred In A.p

03:39 PM ON 30th December, 2015 By Mirchi Vilas

12 IPS Officers Transferred In A.p

ఆంధ్రప్రదేశ్‌లో 12మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగి , రంపచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి, సీఐడీ ఏఎస్పీగా ఎన్‌.శ్వేత, పాడేరు ఏఎస్పీగా శశికుమార్‌, కడప అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బి.సత్య ఏసుబాబు, గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్‌ కమాండర్‌గా కె.ఫకీరప్ప, నర్సీపట్నం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బాబూజీ, విజయనగరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్‌)గా సీహెచ్‌. వెంకట అప్పలనాయుడు , చిత్తూరు పరిపాలన అదనపు ఎస్పీగా అభిషేక్‌ మొహంతి నియమితులయ్యారు.

కాగా విజయరావు, రాహుల్‌దేవ్‌ శర్మ, విశాల్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

English summary