మ్యాచ్ లో ఆ పని చేసినందుకు కోహ్లికి 12 లక్షలు జరిమానా

12 lakhs fine for Virat Kohli

01:20 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

12 lakhs fine for Virat Kohli

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల రూపాయలు జరిమానా విధించారు. ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం 'రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి ఈ జరిమానా విధించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ, ఏబి డివిలియర్స్ చెలరేగి ఆడి తమ జట్టుకు విజయాన్నందించారు. దీంతో 13 పరుగుల తేడాతో ధోని నాయకత్వం వహిస్తున్న రైజింగ్ పుణె జట్టు ఓడిపోయింది. ఐపీఎల్ నిబంధనల మేరకు కోహ్లీకి ఈ జరిమానా విధించడం జరిగిందని చెప్పారు.

అయితే పుణెతో జరిగిన మ్యాచ్ లో ఏబి డివిలియర్స్ 46 బంతుల్లో 83(6ఫోర్లు, 2 సిక్స్ లు), కోహ్లీ 63 బంతుల్లో 80(7ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభణతో ఆ జట్టు బెంగళూరు టీం 185 పరుగులు చేసింది. ఆ తర్వాత 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పూణే 172 పరుగులుకే పరిమితమయింది. దీంతో 13 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.

English summary

12 lakhs fine for Virat Kohli. Indian batsmen Virat Kohli is the captain for IPL Bangalore team. In yesterday match Bangalore bowled slow over rate. For that IPL members fined 12 lakhs for Kohli.