వ్యాన్ లో  సిలిండర్  పేలి 12 మంది బలి

12 People Died By Exploding Cylinder In Pakistan

11:40 AM ON 4th January, 2016 By Mirchi Vilas

12 People Died By Exploding Cylinder In Pakistan

పాకిస్తాన్ లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. పాకిస్థాన్‌లోని కరాక్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలిలా వున్నాయి. ఓ ప్యాసింజర్‌ వ్యాన్‌ పెషావర్‌ నుంచి డెరా ఇస్మాయిల్‌ ఖాన్‌ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా వ్యాన్‌లోని సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు సాగుతోంది.

English summary

A cylinder in van exploded in karak district of pakistan. In this incident almost 12 people were died and soo many people were injured in this incident