ఆ 12మంది గులాబి దళమేనట

12 TDP MLAs Merged In TRS Party

09:42 AM ON 11th March, 2016 By Mirchi Vilas

12 TDP MLAs Merged In TRS Party

తెలంగాణ రాష్ట్రంలో 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో విలీనమయ్యారు. ఈ మేరకు శాసనసభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. తమను టిఆర్ఎస్ లో విలీనం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రాసిన లేఖను సభాపతి మధుసూదనాచారి ఆమోదించారు. టిఆర్ఎస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి , సాయన్న, తీగల కృష్ణారెడ్డి, వివేకానందగౌడ్‌ , ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ , ప్రకాశ్‌గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, రాజేందర్‌రెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ లో విలీనమయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో టిడిపిలో 15మంది నెగ్గితే, రేవంత్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్యలు మాత్రమే మిగిలారు.

స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్న రమణ

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. 12 మంది టిడిపి ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేస్తూ స్పీకర్‌ నిర్ణయించిన నేపధ్యంలో రమణ స్పందిస్తూ, ఈ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

English summary