విడాకులు తీసుకున్న బాలికలు 12 వేల పైనే..

12 thousand girls taken divorce

02:39 PM ON 15th September, 2016 By Mirchi Vilas

12 thousand girls taken divorce

ఓపక్క బాల్య వివాహాలు తగదని చట్టాలున్నా మరోపక్క సాగిపోతూనే వున్నాయి. కందుకూరి వీరేశలింగం, రాజా రామమోహన్ రాయ్ తదితర సంఘ సంస్కర్తలు చేసిన ఉద్యమాలను సైతం జనం జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదు. ఇక ఇలా పెళ్లిళ్లు అవుతుంటే, అలా విడాకులకు రెడీ అవుతున్నారు. దేశంలో 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న 12,105 మంది బాలికలు తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారని తేలింది. 2011 జనాభా గణాంకాల్లో దిమ్మతిరిగిపోయే ఈ వాస్తవం వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని బాలికలు పెళ్లి అయ్యాక విడాకులు తీసుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బాల్య వివాహాలు చేసుకొని విడాకులు తీసుకున్న బాలికల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.

మహారాష్ట్రలో 1,984 మంది బాలికలు విడాకులు తీసుకున్నారని జనాభా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 1,875 మంది బాలికలు, గుజరాత్ లో 1,638, పశ్చిమబెంగాల్ లో 1,286, బీహార్ లో 801 మంది బాలికలు విడాకులు పొందిన వారిలో ఉన్నారని తేలింది. రాజస్థాన్ బాల్య వివాహాలకు రాజధానిగా నిలిచింది. రాజస్థాన్ లో 366 మంది మైనర్ బాలికలు విడాకులు తీసుకున్నారని వెల్లడైంది. దేశంలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సేకరించిన సమాచారంలో 12వేల మందికి పైగా బాలికలు విడాకులు తీసుకున్నారని జనాభా గణన సంయుక్త సంచాలకులు ఏకే సక్సేనా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: బట్టలు బాలేదని లోపలకి రానివ్వకుండా ఆపేసిన ఫేమస్ రెస్టారంట్!

ఇది కూడా చదవండి: ఆ ఊళ్ళో 11 ఏళ్లనాటి సమస్య ఆ అమ్మాయి ఇలా తీర్చేసింది

ఇది కూడా చదవండి: దారుణం: ఆ మహిళ చనిపోయిందని ఏం చేశారో తెలిస్తే షాకౌతారు!

English summary

12 thousand girls taken divorce. According to 2011 survey in India upto 12 thousand girls taken divorce from their husbands.