కృష్ణా పుష్కరాలకు 12వేల మందితో బందోబస్తు

12 Thousand Police Security For Krishna Pushkaralu

11:38 AM ON 8th July, 2016 By Mirchi Vilas

12 Thousand Police Security For Krishna Pushkaralu

వచ్చే ఆగష్టు 12నుంచి జరుగనున్న కృష్ణా పుష్కరాల కు భారీ బందోబస్తు వినియోగించనున్నారు. బందోబస్తు కోసం ఏకంగా 12వేల సిబ్బందిని వినియోగించనున్నారు. ఐజీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సిబ్బంది గదులను, పోలీస్ కార్యాలయంలో రూరల్ పోలీసులు ఏర్పాటు చేసిన పుష్కరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏపీ డీజీపీ. జెవి. రాముడు ప్రారంభించారు. సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలు త్రిపాఠి, నారాయణ్ నాయక్ , అదనపు ఎస్పీలు, డిఎస్పీలు ఉన్నారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ గతంలో పుష్కరాల సందర్భంగా జరిగిన లోపాలు, ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం పెద్దసంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ లను వినియోగించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో పుష్కరాల పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఆయా పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులపై ఆదేశించామన్నారు. ఈ నెల 25లోగా పనులు పూర్తి కావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు డెడ్ లైన్ విధించారని కూడా ఆయన గుర్తుచేశారు. 25లోగా పనులు పూర్తి అయితేనే తాము ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. ఎక్కడెక్కడ ఘాట్ లు ఉన్నాయని, ఎక్కడ బారికేడ్లు ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:ఆ ఊళ్ళో హనుమంతుని పేరు వినిపించినా పూజించినా ఇక అంతే!

ఇవి కూడా చదవండి:పెళ్ళైన వ్యక్తితో ప్రేమ యవ్వారం - కూతురిని చంపేసిన తల్లి

English summary

Krishna Pushkaralu was going to be held in a grand way and Andhra Pradesh Government was planning to do this Krishna Pushkaralu with a tight security and DGP J.V.Ramudu said that 12,000 police security was using for Krishna Pushkaralu.