బాలికను సజీవ దహనం చేసేసిన మహిళ ... విషయం తెలిస్తే షాకవుతాం

12 year old girl burnt alive by jaiswal

11:59 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

12 year old girl burnt alive by jaiswal

అనుమానం పెనుభూతం అన్నారు కదా. ఎందుకంటే ఓ సారి అనుమానం వస్తే , ఎవరెన్ని చెప్పినా , నిజాలు వివరించినా ఆ అనుమానం ముందు అన్నీ దిగదుడుపే. సరిగ్గా అలాంటిదే ఈ దారుణ సంఘటన. ఇంతకీ ఇది ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దొంగతనం చేసిందన్న అనుమానంతో ఓ బాలికను మహిళ సజీవ దహనం చేసేసింది. గొండ్వారా ప్రాంతానికి చెందిన జైస్వాల్ ఇంట్లో గత కొన్ని రోజులుగా వస్తువులు మాయమవుతున్నాయి. దీంతో స్థానిక పిల్లలపై ఆమె అనుమానం పెంచుకుంది.

ఆర్తి అనే 12 ఏళ్ళ బాలిక తోటి పిల్లలతో కలిసి గోలీలు ఆడుతోంది. ఓ గోలీ జైస్వాల్ ఇంట్లోకి వెళ్ళడంతో దాని కోసం లోపలకు వెళ్ళింది. దీంతో ఆర్తి దొంగతనం చేసేందుకు వచ్చిందన్న అనుమానంతో ఆగ్రహించిన జైస్వాల్, ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి గదిలో బంధించింది. 85 శాతం కాలిన గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో జైస్వాల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై హత్యతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అక్కడ సంచలనం కలిగించింది.

ఇది కూడా చూడండి: బాహుబలి కంటే పెళ్లి చూపులకే ఓటేస్తానన్న దాసరి

ఇది కూడా చూడండి: 'కాకతీయుడు' కేక పెట్టిస్తాడట..

ఇది కూడా చూడండి: బాహుబలితో కొన్ని మిస్ అయ్యాడు.. అందుకే ఇప్పుడు స్పీడ్ పెంచాడు

English summary

12 year old girl burnt alive by jaiswal. Raipur Police arrested jaiswal for allegedly burning 12 year old minor girl over theft suspicion.