124 గంటల డ్యాన్స్ తో గిన్నీస్ రికార్డు

124 hours non stop dance

04:38 PM ON 11th April, 2016 By Mirchi Vilas

124 hours non stop dance

ఒకటా రెండా మూడా ఏకంగా 124 గంటల పాటు డ్యాన్స్ చేయడం చాలా కష్టం... పైగా కాసేపు నృత్యం చేస్తేనే అలసిపోతారు. మరి అలాంటిది ఏకధాటిగా 124 గంటలు పైగా అస్సలు విరామం లేకుండా డ్యాన్స్ చేయడం కష్టం కాకా మరేమిటి? అయితే మనిషిగా ఏదో రికార్డు సాధించాలన్న తపనతో కష్టాన్ని ఇష్టంగా మలచుకుని, 30 ఏళ్ల మహిళ 124 గంటల పాటు డ్యాన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఫలితంగా గిన్నీస్ రికార్డు కెక్కింది. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శాస్త్రీయ నృత్యకారిణి సోని చౌరస్య ఆపకుండా 124 గంటల పాటు నిర్విరామంగా డాన్స్ చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. దీంతో అత్యధిక గంటలు నృత్యం చేసి గతంలో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

ఒకసారి గతంలోకి వెళ్తే, 2011 లో కేరళకు చెందిన హేమలత అనే మహిళ పేరుతో రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డును చౌరస్య అధిగమించింది. 123 గంటలు ఆమె ఆపకుండా నృత్యం చేస్తూ ఉంటే ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో ఆమెను మరింత ఉత్సాహ పరిచారు. దీంతో ఆమె 124 గంటల పాటు నృత్యం చేసి నూతన రికార్డు నెలకొల్పింది. అందరూ అభినందనలతో ముంచెత్తారు.

English summary

124 hours non stop dance. In Uttara Pradesh a classical dancer non stoppable dance upto 124 hours.