1.25 కోట్ల జీతం..గూగిల్ కొలువు

1.25 Crore Job Offer From Google

03:48 PM ON 24th November, 2015 By Mirchi Vilas

1.25 Crore Job Offer From Google

ఢిల్లీ కి చెందిన చేతన్ కక్కర్ అనే 22 ఏళ్ళ యువకుడికి ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 1.25 కోట్ల సంవత్సర ప్యాకేజి గల ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. చేతన్ ప్రస్తుతం ఢిల్లీ లోని ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ లో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు . ఐతే యూనివర్సిటీ లో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో చేతన్ గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు. ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ వారు చెప్పిన వివరాల ప్రకారం యూనివర్సిటీ చరిత్రలో ఇంత ప్యాకేజిను ఆఫర్ చెయ్యడం మొదటిసారని , ఇది వరకు అత్యధిక ప్యాకేజి 93 లక్షలు గా ఉండేదని తెలిపారు.

ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ గూగుల్ సంస్థ లో చేరడానికి చాల ఆత్రుతగా ఎదురు చూస్తునట్లు చెప్పాడు. 2016 తన ఆఖరి సంవత్సరం చదువు పూర్తి అవ్వగానే కాలిఫోర్నియా లోని గూగుల్ ఆఫీసు లో పని చేయనున్నట్లు తెలిపాడు.
చేతన్ అమ్మ నాన్నలు కూడా ఇదే యూనివర్సిటీ లో కెమిస్ట్రీ , మేనేజ్మెంట్ స్టడీస్ ప్రోఫేసర్లుగా పని చేస్తున్నారు.

English summary

A 22 year old boy named Chetan Kakkar gets 1.25 crore job offer package fron google.Present he is studying final year in Delhi Technical University