సర్దార్‌ ఆడియోకి అన్ని కోట్లు ఖర్చా!

1.25 crores spending for Sardar Gabbar Singh audio

12:34 PM ON 15th February, 2016 By Mirchi Vilas

1.25 crores spending for Sardar Gabbar Singh audio

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. పవన్‌ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'పవర్‌' ఫేమ్‌ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 8న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మార్చిలో విడుదలవ్వబోయే ఈ ఆడియో కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియమ్ లో నిర్వహించబోయే ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబు ముఖ్య అతిధిలుగా విచ్చేయచున్నారు.

ఈ ఆడియోకి లక్షకి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉందట. అందుకోసం దాదాపు 1.25 కోట్లు ఖర్చు చేస్తుండడం విశేషం. అంతేకాదు ఈ ఆడియో వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌ ఎప్పటిలానే లైవ్‌ స్టేజ్‌ పెరఫార్మెన్స్‌ ఇవ్వబోతున్నాడట.

English summary

1.25 crores spending for Sardar Gabbar Singh audio function. This movie is directing by Power fame Bobby. Kajal Agarwal is romancing first time with Pawan Kalyan in this movie.