క్యూబా రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

13 People Died In Truck Accident In Cuba

05:25 PM ON 29th December, 2015 By Mirchi Vilas

13 People Died In Truck Accident In Cuba

క్యూబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాంటియాగో-దె-క్యూబా ప్రావిన్స్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ బస్సు ఎదురుగా వస్తున్న రెండు ట్రక్కులను ఢీకొంది. దీంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 34 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

English summary