బిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ళ బాలిక

13 Year Girl GIves BIrth To Baby

02:11 PM ON 1st December, 2015 By Mirchi Vilas

13 Year Girl GIves BIrth To Baby

హైదరాబాద్‌లోని మదాపూర్‌ లోని ఒక గవర్నమెంట్‌ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. కడుపు నొప్పిని బాలిక చెప్పడంతో 13 ఏళ్ళ బాలికతో పాటు మరో బాలికను ఆమెకు తోడుగా టీచర్‌ బాత్రూంకు పంపారు. అయితే తోడుగా వెళ్ళిన ఆమె క్లాస్‌మేట్‌ వచ్చి ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పింది. దీంతో ఆశ్చర్యపోయిన టీచర్‌ స్కూల్‌ యాజమాన్యానికి , బాలిక తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తెలిపారు.13 ఏళ్ళ బాలికను బిడ్డను ఆసుపత్రికి తరలించారు. బిడ్డ పరిస్థితి క్షేమంగా ఉందని డాక్టర్‌లు తెలిపారు.

ఈ ఘటన గడచిన శనివారం జరిగినప్పటికీ కూడా ఆ స్కూల్ టీచర్లు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ యాజమాన్యం వారు మాట్లాడుతూ బాలిక ఎప్పుడు మాములు గానే స్కూల్‌కు వచ్చేదని ఎప్పుడు ఏమి తెలియలేదని తెలిపారు . బాలిక తల్లిదండ్రులను ఈ విషయమై అడగగా తమకు అసలు తమ కూతురు గర్భం దాల్చిన సంగతి తెలియదని చెప్పారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఎంఈవో, హెచ్‌ఎం లను సస్పెండ్‌ చేసి మరో సదిమందికి షోకాజ్‌ నోటీసులు పంపారు.

English summary

A 13 year old girl who was studying IX class in Government school at Madhapur in Hyderabad had delivered a baby in the bathroom of the school on Saturday