వెంకటేశ్వర స్వామితో 13 ఏళ్ల చిన్నారికి పెళ్లి(వీడియో)

13 years girl married lord Venkateswara Swamy

10:55 AM ON 10th June, 2016 By Mirchi Vilas

13 years girl married lord Venkateswara Swamy

అవునా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది మనుష్యులకు రకరకాల సంప్రదాయాల మీద నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాలు, ఆచారాలు వివిధ కులాలు, వృత్తులు, వర్గాలు, జాతుల్లో రకరకాలుగా ఉంటాయి. చాలా మంది ఆచారాలు చాలా కొత్తగా సరికొత్తగా ఉంటాయి. ఇక తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని సాంప్రదాయం కొనసాగుతోంది. అక్కడ ఓ 13 సంవత్సరాల బాలికకు ఏకంగా వెంకటేశ్వరస్వామితో వివాహం జరిపించారు. ఇదేంటని అడిగితే ఇది తమ ఆచారమని, దీన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నామని వారు చెపుతున్నారు.

సాధారణ వివాహ మహోత్సవానికి ఉండే హంగామా, వివాహ తంతు అంతా యదాతథంగా కొనసాగింది. ఇలా వివాహం చేసిన కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేస్తారట. ఆ వధువుకు ఇలా పెళ్లి చేసి అత్తారింటికి పంపితే ఆ అత్తమామలూ.. పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామి తమ ఇంటికి వచ్చినట్టు భావిస్తారట. స్వామి వారితో వివాహం మీడియాలో ప్రసారమైంది. మనం ఓ సారి వీక్షిద్దాం..

English summary

13 years girl married lord Venkateswara Swamy