13,000 జీబీతో సరికొత్త హార్డ్ డిస్క్

13000 GB Hard Disk

12:51 PM ON 26th January, 2016 By Mirchi Vilas

13000 GB Hard Disk

ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కామన్ అయిపోయింది. కీలకమైన ఫైల్స్, వీడియోలు, ఆడియోలు, సర్టిఫికెట్లు అన్నీ వీటిలోనే నిక్షిప్తం చేసుకుంటున్నారు. అయితే సిస్టమ్ లో ఖాళీ లేకపోతే ఎక్కువ మంది వినియోగించేది హార్డ్ డిస్క్. కంప్యూటర్ల వాడకంలో ఇది ఎంతో కీలకం. మనిషికి మెదడులాగా పీసీకి ఈ డిస్క్‌లు మెమొరీ బ్యాంక్‌లులాగా పనిచేస్తాయి. ఫైల్స్ ఎడిటింగ్, క్రియేటింగ్, నిర్వహణ, అప్లికేషన్స్ రన్నింగ్, మల్టీమీడియా... ఇలా చెప్పుకుంటూ పోతే కంప్యూటర్‌లో మనం చేసే ఏ పనికైనా హార్డ్ డిస్క్‌ల వినియోగం తప్పనిసరి. ఒకప్పుడు కేవలం మెగాబైట్ (ఎంబీ) సామర్థ్యంతో లభ్యమైన ఈ డిస్క్‌లు జీబీల స్థాయి దాటి టెరాబైట్ (టీబీ)ల స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న అనేక రకాల హెచ్‌డీడీల్లో 320 జీబీ మొదలుకొని అంతకుపైనే స్టోరేజ్ కెపాసిటీ కలిగిన డిస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. కాగా జపాన్‌కు చెందిన ఓ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఈ హార్డ్ డిస్క్ ప్రపంచంలోనే అత్యంత అధిక స్టోరేజ్ స్పేస్ కలిగిన డిస్క్‌గా రికార్డు సృష్టించింది. టోక్యోకు చెందిన ఫిక్స్‌స్టార్స్ సంస్థ 13వేల జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన నూతన ఎస్‌ఎస్‌డీని వినియోగదారులకు అందిస్తోంది. 2.5 ఇంచుల సైజ్ మాత్రమే ఉండే ఈ డిస్క్ పేరు ఫిక్స్‌స్టార్స్ ఎస్‌ఎస్‌డీ- 13,000 ఎం. దీని ద్వారా యూజర్లు డేటాను సెకన్‌కు 540 ఎంబీ స్పీడ్‌తో రీడింగ్ చేయవచ్చు. డేటా స్టోరేజ్, స్ట్రీమింగ్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రొడక్షన్స్, 4కె/8కె వీడియో ప్రాసెసింగ్ వంటి హై ఎండ్ పెర్‌ఫార్మెన్స్ పనులను ఈ డిస్క్‌తో సునాయాసంగా చేసుకునే వీలుంది. దీని ధర సుమారు రూ.8.8 లక్షలు.

English summary

A new hard disk had been launched with a huge memory of 13000 GB capacity. With the use of this hard disk we transfer data at the speed of 540 Mbps per second