భారతదేశంలో భవనాలు కూలిపోయి 13000 మంది మరణించారు

13000 people died due to collapse buildings

05:11 PM ON 5th April, 2016 By Mirchi Vilas

13000 people died due to collapse buildings

మార్చి 31 న కోలకతా గిరీష్ పార్క్ సమీపంలో ఒక ఇరుకైన రోడ్డు కూడలిలో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైఓవర్ కూలిపోయిన సంఘటనలో 26 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. అయితే హైదరాబాద్ నిర్మాణ సంస్థ అయిన IVRCL మాత్రం దేవుని చర్యగా అభివర్ణించెను.

ఇది కూడా చదవండి : ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతుందా ?

కానీ ఇటువంటి దేవుని చర్యలు ప్రతి రోజు దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. NCRB గణాంకాల ప్రకారం ప్రతి రోజు భవనాలు కూలిపోయిన సంఘటనలలో సగటున ఏడు మంది చనిపోతున్నారు. 2010 నుంచి 2014 మధ్య ఐదేళ్లకాలంలో, నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోవటంతో సుమారు 13000 మంది చనిపోయారు.

ఇది కూడా చదవండి : ప్రపంచాన్ని వణికించిన సంఘటనలు

నిజానికి 2011 లో ఇటువంటి సంఘటనల వలన ఎక్కువ మంది చనిపోయారు. చనిపోయిన 13000 మందిలో 4900 మంది కేవలం నివాస భవనాలు కూలిపోవటం వలన చనిపోయారు.

ఇది కూడా చదవండి : బతికుండగానే తల్లిని పాతేసాడు(వీడియో)

ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉత్తర ప్రదేశ్ లో భవనాలు కూలిపోవటం వలన 2065 మంది చనిపోయారు. యాదృచ్ఛికంగా, వెస్ట్ బెంగాల్ లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో భవనాలు కూలి మరణించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

English summary

Out of the 13, 000 deaths, over 4,900 have been due to collapse of residential buildings or homes.