14 వేల మంది యాచకులు .. మరి రాబడి చూస్తే షాకవుతారు

14 thousand beggars and their revenue 24 crore

12:24 PM ON 10th June, 2016 By Mirchi Vilas

14 thousand beggars and their revenue 24 crore

బిచ్చ గాళ్ళని తేలిగ్గా కొట్టి పారేస్తే, ఘోరంగా దెబ్బతింటారు. ఆ మధ్య పోకిరి సినిమాలో బిచ్చగాళ్ళ హడావిడి చూసాం కదా ...ఆ రేంజ్ వేరు కదా .. .. సినిమాలోనే కాదు నిజ జీవితం లో కూడా కొందరికి బిచ్చం లాభసాటి వ్యాపారమట. ... ఇది ఎక్కోదో ఫారిన్ లో మాత్రం కాదు .. ఇండియాలోనే అదికూడా భాగ్యనగరంలోనే ... సర్వేలో ఈ విషయం తేలిందట. ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద నిత్యం కనిపించే యాచకులకు నగరంలో ప్రతి నెలా అందుతున్నది అక్షరాలా రూ.2 కోట్లు. అంటే ఏడాదికి రూ.24 కోట్లు. స్వయంగా ఈ విషయం హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం వెల్లడించారు. నగరంలో ప్రధాన కూడళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద యాచకుల బెడద అధికంగా ఉంటోందని ఆయన చెబుతూ, వీరిలో రెండు శాతం మందే నిజమైన వారని, మిగిలిన 98 శాతం మంది యాచక వృత్తిని వ్యాపారంగా మార్చుకున్నారని ఓ సంస్థ సర్వే తేల్చిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో నగరాన్ని యాచక రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జీహెచ్ ఎంసీ, పోలీసులతోపాటు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొంటారు. యాచక వృత్తి నివారణ ప్రచారోద్యమం, నిజమైన యాచకులకు పునరావాసం, యాచకులకు డబ్బు దానం చేయకుండా నగర పౌరుల్లో అవగాహన కల్పించడం తదితర అంశాలను చర్చిస్తామని మేయర్ చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: ఈ షూట్ టర్నింగ్ పాయింట్?(ఫోటోలు)

ఇది కూడా చూడండి: అది చెప్పడానికి సిగ్గుపడను..

ఇది కూడా చూడండి: కుబేరుడికి సైతం దిమ్మతిరిగే ఖరీదైన పెళ్లి...

English summary

Shocking news 14 thousand beggars and their revenue is 24 crore.