హైపర్ పిగ్మెంటేషన్ నివారణకు 14 మార్గాలు

14 Ways to Reduce Hyperpigmentation

10:45 AM ON 29th December, 2015 By Mirchi Vilas

14 Ways to Reduce Hyperpigmentation

హైపర్ పిగ్మెంటేషన్ కి చికిత్స

హైపర్ పిగ్మెంటేషన్ కి కెమికల్ పిల్స్,క్రీమ్స్, లేజర్ చికిత్స మరియు ఇంటి నివారణల వంటి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. అయితే చికిత్స అనేది పిగ్మెంటేషన్ తీవ్రతను బట్టి ఉంటుంది.  పిగ్మెంటేషన్ ప్రారంభ దశలో ఉంటే ఇంటి చిట్కాలతో నయం చేయవచ్చు.  పిగ్మెంటేషన్ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళటం మంచిది.

హైపర్ పిగ్మెంటేషన్ కోసం ప్రభావవంతమైన ఇంటి నివారణలు

ఈ సమస్య పరిష్కారానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళితే ఖరీదైన మరియు కఠినమైన కెమికల్స్ ఉండే మందులకు వాడవలసి ఉంటుంది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి కొన్ని నివారణలను ఇంటిలో ప్రయత్నం చేయవచ్చు. ఈ  సహజ ఉత్పత్తులు చాలా వరకు మీకు మీ వంటగదిలోనే అందుబాటులోనే ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే సులభంగా మార్కెట్ లో దొరుకుతాయి. వీటి వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

1/15 Pages

1.  బంగాళదుంప

హైపర్ పిగ్మెంటేషన్ వలన వచ్చే టాన్, నల్లని మచ్చలను తొలగించుకోవటానికి ఇది బాగా ప్రసిద్ది చెందిన చికిత్స అని చెప్పవచ్చు.

కావలసినవి

  • బంగాళదుంప సగం ముక్క ( చీలికలుగా కోయాలి)

చేసే విధానం

  •  బంగాళదుంప ముక్కను సన్నని ముక్కలుగా కోయాలి.
  •  ప్రభావిత ప్రాంతాన్ని ఈ ముక్కలతో సున్నితంగా రబ్ చేయాలి.
  • రబ్ చేసిన తర్వాత 15 నిముషాలు అలా వదిలేయాలి.
  • ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
  •  ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

అలాగే మీరు బంగాళదుంప రసాన్ని తీసి ప్రతి రోజు ప్రభావిత ప్రాంతంలో రాసిన మంచి పలితాన్ని పొందవచ్చు.

English summary

Hyperpigmentation will cause your skin dark and patches. Here you can follow any of these 14 process to reduce Hyperpigmentation.