పిక్నిక్ కు డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

14 year girl sucide's for not giving money for picnic

06:57 PM ON 8th December, 2015 By Mirchi Vilas

14 year girl sucide's for not giving money for picnic

పిక్నిక్ కు వెళ్ళడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఆవేదన చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ముంబై కి చెందిన మౌనికా గోవింద్‌ అర్యల్‌ అనే 14 ఏళ్ళ బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్కూలు లోని తన సహచరులతో కలిసి పిక్నిక్‌ వెళతానని ఆమె తల్లి దండ్రలను 750 రూపాయలును ఇవ్వమని అడగగా మౌనిక తల్లిదండ్రులు వద్దని అనడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఐదు అంతస్తుల భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం పై మౌనిక తల్లిదండ్రులు మాట్లాడుతూ గడిచిన 11 వ తేదిన మౌనిక పిక్నిక్‌ వెళతానని మరల అడగడంతో అమె తల్లిదండ్రులు తమ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని , తమ ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని మందలించడంతో కోపం తెచ్చుకున్న మౌనిక సమాన్లను విసిరిగొట్టిందని , దీంతో ఆమె తల్లి కొట్టగా ఆవేదన చెంది తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, తమకు విషయం రాత్రి 2 గంటలకు స్థానిక వ్యక్తి చెప్పడంతో తెలుసుకున్నామని, ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గ మధ్యలొనే ఆమె చనిపోయిందని తెలిపారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాట్లాడుతూ మృతురాలు మౌనిక తన స్నేహితులందరికి తాను పిక్నిక్‌కు వస్తానని చెప్పిందని కాని అమె తఃల్లిదండ్రులు వారి ఆర్ధిక పరిస్థితి పెద్దగా బాగోనందు వల్ల అడిగిన డబ్బులు ఇవ్వకపోవడం తోనే మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

English summary

A 14 year girl named mounika govind aryal who studies 9th standard has been killed herself for not giving money of 750 rupeers for picnic