మైనర్‌ బాలిక పై సైనికుల గ్యాంగ్‌ రేప్‌

14 Year Old Girl Gang Raped By Soldiers In Train

01:51 PM ON 29th December, 2015 By Mirchi Vilas

14 Year Old Girl Gang Raped By Soldiers In Train

ఒక 14 సంవత్సరాల మైనర్‌ బాలిక పై దేశాన్ని కాపాడాల్సిన సైనికులు దారుణానికి ఒడిగట్టారు. ముగ్గురు సైనికులు విచక్షణారహితంగా బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే 14 ఏళ్ళ మైనర్‌ బాలిక తన స్నేహితురాలిని కలవడానికి లుధియానాకు వెళ్తూ , హోరా-అమృతసర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆర్మీ కంపార్టుమెంట్‌ లోని ఎక్కింది. అయితే ఆర్మి కంపార్టుమెంట్‌లోని ముగ్గురు సైనికులు ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ విషయం తెలసుకున్న బాలిక తండ్రి స్థానిక రైల్వే పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాలికకు బలవంతంగా మద్యం తాగించిన ముగ్గురిలో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

English summary

14 Year Old Girl Gang Raped By Soldiers In Train in a military reserved coach on the Howrah-Amritsar Expres.